Begin typing your search above and press return to search.

ఆ భ‌యాల‌కు `బ్ర‌హ్మాస్త్ర‌` చెక్ పెడుతుందా?

By:  Tupaki Desk   |   4 Sep 2022 4:30 AM GMT
ఆ భ‌యాల‌కు `బ్ర‌హ్మాస్త్ర‌` చెక్ పెడుతుందా?
X
బాలీవుడ్ గ‌త కొంత కాలంగా గ‌డ్డు ప‌రిస్థితుల్ని ఎదుర్కొంటోంది. స్టార్ హీరోల సినిమాల నుంచి ఓ మోస్త‌రు మార్కెట్ వున్న హీరోల సినిమాల వ‌ర‌కు థియేట‌ర్ల‌కు అలా వ‌చ్చి ఇలా వెళ్లిపోతున్నాయి. కంటెంట్ ఆక‌ట్టుకునే స్థాయిలో వుండ‌క‌పోవ‌డం, ఉత్త‌రాదిలో మ‌ల్టీప్లెక్స్ సంస్కృతి బాగా పెరిగిపోవ‌డం.. టికెట్ రేట్లు ఆకాశాన్నంట‌డంతో బాలీవుడ్ సినిమాల‌కు గ‌త కొన్ని నెల‌లుగా క‌ష్ట‌కాలం మొద‌లైంది. దీనికితోడు బాయ్ కాట్ బాలీవుడ్ వివాదం కూడా బాలీవుడ్ ఇండ‌స్ట్రీని ఓ కుదుపు కుదిపేస్తోంది.

రీసెంట్ గా విడుద‌లైన అమీర్ ఖాన్ `లాల్ సింగ్ చ‌డ్డా`, అక్ష‌య్ కుమార్ `ర‌క్షాబంధ‌న్‌` బాయ్ కాట్ వివాదం కార‌నంగా భారీ డిజాస్ట‌ర్ లుగా నిలిచి బాక్సాఫీస్ వ‌ద్ద‌ భారీ న‌ష్టాల‌ని చ‌విచూశాయి. అంత‌కు ముందు విడుద‌లైన ర‌ణ్ బీర్ క‌పూర్ `షెంషేరా`, అక్ష‌య్ కుమార్ `సామ్రాట్ పృథ్వీరాజ్‌` వంటి సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద డిజాస్ట‌ర్ లుగా నిలిచి బాలీవుడ్ కు షాకిచ్చిన విష‌యం తెలిసిందే. దీంతో ఈ సినిమాల నిర్మాత‌లు కోట్ల‌ల్లో న‌ష్టాల‌ని చ‌విచూడాల్సి వ‌చ్చింది.

ఈ నేప‌థ్యంలో ద‌క్షిణాది చిత్రాలు మాత్రం ఉత్త‌రాదిలో భారీ వ‌సూళ్ల‌ని రాబ‌ట్ట‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అమీర్ ఖాన్ `లాల్ సింగ్ చ‌డ్డా`, అక్ష‌య్ కుమార్ `ర‌క్షాబంధ‌న్‌` సినిమాల త‌రువాత విడుద‌లైన నిఖిల్ `కార్తికేయ 2` ఉత్త‌రాదితో రికార్డు స్థాయి వ‌సూళ్ల‌ని రాబ‌డుతూ సంచ‌ల‌నం సృష్టిస్తోంది. ద‌క్షిణాదిలో పాటు ఉత్త‌రాదిలోనూ హ‌వా కొన‌సాగిస్తోంది. ఇప్ప‌టికే ప్ర‌పంచ వ్యాప్తంగా రూ. 100 కోట్ల‌కు మించి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టి సంచ‌ల‌నం సృష్టిస్తోంది. దీంతో చాలా మంది బాలీవుడ్ ప‌రిస్థితి ఇక అయిపోయిన‌ట్టేనా అని కామెంట్ లు చేస్తున్నారు.

బాలీవుడ్ కూడా `బ్ర‌హ్మాస్త్ర‌` అయినా బాలీవుడ్ కు ఊపిరి పోస్తుందా? అని ఆశ‌గా ఎదురుచూస్తోంది. ర‌ణ్ బీర్ క‌పూర్, అలియాభ‌ట్‌, అమితాబ్ బ‌చ్చ‌న్‌, నాగార్జున‌, మౌనీరాయ్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన ఈ మూవీని అయాన్ ముఖ‌ర్జీ కూపొందిస్తే క‌ర‌ణ్ జోహార్, ర‌ణ్ బీర్ క‌పూర్‌, అయాన్ ముఖ‌ర్జీ మ‌రి కొంత మంది క‌లిసి భారీ స్థాయిలో నిర్మించారు. ఈ మూవీ సెప్టెంబ‌ర్ 9న భారీ స్థాయిలో వ‌ర‌ల్డ్ వైడ్ గా విడుద‌ల కానున్న విష‌యం తెలిసిందే. ఈ మూవీకి బాయ్ కాట్ ట్రెండ్ అడ్డంకిగా మారుతుందా? అని అంతా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

అయితే అనూహ్యంగా అలాంటి స‌మ‌స్య ఇప్ప‌టి వ‌ర‌కైతే `బ్ర‌హ్మాస్త్ర‌`కు త‌లెత్త‌లేదు. అంతే కాకుండా ఉభ‌య తెలుగు రాష్ట్రాల‌తో పాటు త‌మిళ‌నాడు, క‌ర్ణాట‌క‌, కేర‌ళ రాష్ట్రాల‌తో పాటు ఉత్త‌రాదిలోనూ ఈ మూవీకి భారీ స్థాయిలో బుకింగ్స్ మొద‌లైన‌ట్టుగా తెలుస్తోంది. మైథాల‌జీ నేప‌థ్యంలో హిందూ పురాణాల ఆధారంగా తెర‌కెక్కిన సినిమా కావ‌డంతో `బ్ర‌హ్మాస్త్ర‌` ఎలా వుండ‌బోతోంద‌నే ఆస‌క్తి దేశ వ్యాప్తంగా మొద‌లైంది. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కైతే 50 నుంచి 60 శాతం టికెట్ బుకింగ్స్ జ‌రిగిన‌ట్టుగా తెలుస్తోంది.

టాక్ బాగుంటే బాలీవుడ్ కు `బ్ర‌హ్మాస్త్ర` ఊపిరిపోయ‌డం ఖాయం అనే కామెంట్ లు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా గ‌త కొంత కాలంగా బాలీవుడ్ ఇక క‌ష్ట‌మనే భ‌యాల‌కు `బ్ర‌హ్మాస్త్ర‌` చెక్ పెట్టే సినిమా అవుతుంద‌ని కూడా ట్రేడ్ వ‌ర్గాలు అంటున్నాయి. ఏం జ‌ర‌గ‌నుంద‌న్న‌ది తెలియాలంటే సెప్టెంబ‌ర్ 9 వ‌ర‌కు వేచి చూడాల్సిందే.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.