Begin typing your search above and press return to search.
కాలేజీ టూర్లు కలెక్షన్లు తెస్తాయా ?
By: Tupaki Desk | 10 July 2019 6:06 AM GMTగత కొంత కాలంగా మన టాలీవుడ్ దర్శక నిర్మాతలు ప్రమోషన్ లో కొత్త దారులు వెతుకుతున్నారు. ఎంతసేపు యాడ్స్ టీవీ ఇంటర్వ్యూలంటే ఆశించిన ఫలితం రావడం లేదు. ఇంతమించి ఏదో చేయాలనే టార్గెట్ తో ప్రజల వద్దకు పాలన తరహాలో ప్రేక్షకుల వద్దకే పబ్లిసిటీని తలెకెత్తుకుని నేరుగా జనంలోకి వెళ్తున్నారు. అందులో ఈ మధ్య కాలంలో బాగా ట్రెండ్ అవుతున్న స్ట్రాటజీ కాలేజీ టూర్లు.
ఇటీవలి కాలంలో ప్రీ రిలీజ్ ఈవెంట్లు లేదా ఆడియో సింగల్ లాంచులు ఎక్కడో బయట చేయకుండా ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీలలో చేయడం మెల్లగా పాకుతోంది. ఒకేసారి వేలాది విద్యార్థులను ఒకేచోట పోగేసే అవకాశం ఉండటం ప్రమోషన్ పరంగా మీడియా కవరేజ్ ఫ్రీగా లభించే అవకాశం ఒక కారణమైతే తమకూ ఉచిత ప్రచారం దక్కుతుందన్న ఆలోచనతో సదరు యాజమాన్యాలు కూడా వీటికయ్యే ఖర్చునంతా భరించడం ఇందులోని మరో కోణం
కానీ ఇవి ఎంతవరకు కలెక్షన్స్ కు దారి తీస్తాయని చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఒక కాలేజీలో ఎన్ని వేల మంది ఉన్నా పరిమిత సంఖ్యలోనే ఉంటారు. వాళ్ళను దాటి ఆ సినిమా యూనిట్ చేసిన హడావిడి బయటికి పోదు. సామాన్య జనం వీటికి హాజరయ్యే అవకాశం ఉండదు కాబట్టి వాళ్ళూ కనెక్ట్ కారు. అలాంటప్పుడు లిమిటెడ్ రీచ్ అనే రిస్క్ ఇలాంటి ఈవెంట్స్ లో ఖచ్చితంగా ఉంటుంది.
అయినా కూడా యూత్ ని టార్గెట్ చేసిన సినిమాలు వీటివైపు మొగ్గు చూపడం గమనార్హం. కాలేజీ వేదికలను ఇలా సినిమా తారల హంగామాతో ఫంక్షన్ హాల్స్ గా మారుస్తున్నారని విద్యావేత్తల విమర్శలు ఉన్నప్పటికీ ఉభయకుశలోపరిగా ఉన్న ఈ స్ట్రాటజీని వదులుకునేందుకు ఎవరూ రెడీగా లేరు. కాకపోతే వసూళ్లకు ఇవి ఎంత వరకు సహాయపడతాయి అన్నది అనుమానమే