Begin typing your search above and press return to search.
గ్యాంగ్ ని టెన్షన్ పెడుతున్న కామ్రేడ్
By: Tupaki Desk | 30 July 2019 4:55 AM GMTనాగార్జున శివ రేంజ్ లో కెరీర్ బెస్ట్ గా నిలిచిపోతుందని ఎన్నో అంచనాలు పెట్టుకున్న విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ని నిరాశలో ముంచెత్తుతూ డియర్ కామ్రేడ్ రివర్స్ గేర్ లో రోజురోజుకి కలెక్షన్లను తగ్గించుకుంటూ వెళ్తోంది. వీక్ డేస్ లో డ్రాప్ సహజమే కానీ దీనికి తీవ్ర స్థాయిలో ఉండటం బయ్యర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. యూనిట్ ఎంత క్లాసిక్ అని ప్రచారం చేసుకున్నా అది వసూళ్లకు హెల్ప్ అవ్వడం లేదు సరికదా ఆల్రెడీ ఉన్న డివైడ్ టాక్ ఇంకా బలపడుతోంది. అన్ని ఏరియాల్లో నష్టాలు ఖాయమని ట్రేడ్ ఫిక్స్ అయిపోయింది. అది ఎంత శాతం అనేది బయట పడాలి.
ఇదిలా ఉండగా ఇప్పుడీ కామ్రేడ్ రిజల్ట్ నాని గ్యాంగ్ ని టెన్షన్ పెడుతున్నట్టుగా ఇన్ సైడ్ టాక్. కారణం ఉంది. డియర్ కామ్రేడ్ నాని గ్యాంగ్ లీడర్ రెండింటికి నిర్మాత మైత్రినే. ఇప్పుడు విజయ్ సినిమాకు తీవ్రంగా నష్టాలు వస్తున్నాయి కాబట్టి వాటిని నాని మూవీకి సర్దమని అడుగుతున్నారట. ఇది సహజంగా అందరు పెద్ద బ్యానర్లకు ఎదురయ్యే వ్యవహారమే. నాని గ్యాంగ్ లీడర్ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. బిజినెస్ డీల్స్ కూడా బాగా జరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కానీ డియర్ కామ్రేడ్ ఇచ్చే లాస్ మాములుగా లేకపోవడంతో గ్యాంగ్ లీడర్ రీజనబుల్ గా ఇవ్వమని బయ్యర్లు డిమాండ్ చేసే ఛాన్స్ లేకపోలేదు.
ఈ విషయంలో మైత్రి వాళ్ళు తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఆ తర్వాత వచ్చే ఉప్పెన లాంటి ఇతర సినిమాల బిజినెస్ ఆధారపడి ఉంటుంది. ఎంతో కొంత తగ్గించక తప్పదని వినికిడి.. డియర్ కామ్రేడ్ ని విజయ్ దేవరకొండ మార్కెట్ ని మించి కంటెంట్ మీద నమ్మకంతో ఎక్కువ రేట్లకు కొన్నామని ఇప్పుడు బ్రేక్ ఈవెన్ కూడా కానప్పుడు దీనికి ఎవరు బాధ్యత అనే కోణంలో చర్చలు జరిగాయట. మొత్తానికి ఏదో పాటలో చెప్పినట్టు విజయ్ కాల్చిన చుట్ట నాని కొంపకు ఎసరు పెట్టినట్టు ఉంది.