Begin typing your search above and press return to search.
దేవి ఆ మ్యాజిక్ ని మళ్లీ రిపీట్ చేస్తాడా?
By: Tupaki Desk | 15 Oct 2022 10:34 AM GMT'పుష్ప ది రైజ్'తో పాన్ ఇండియా వైడ్ గా భారీ క్రేజ్ ని సొంతం చేసుకున్నాడు యువ సంగీత సంచలనం దేవి శ్రీప్రసాద్. ఆ తరువాత ఖిలాడీ, ది వారియర్ సినిమాలకు బ్లాక్ బస్టర్ ఆడియోస్ ని అందించి ట్రెండింగ్ లో వున్నాడు. కానీ తను 'పుష్ప' తరువాత సంగీతం అందించిన ఏ సినిమా కూడా పెద్దగా విజయాన్ని సొంతం చేసుకోలేదు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 154వ మూవీకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.
గతంలో చిరుతో కలిసి దేవి పని చేసిన ప్రతీ మూవీ చాలా వరకు బ్లాక్ బస్టర్ హిట్ లుగా నిలిచాయి. శంకర్ దాదా ఎంబీ బిఎస్, అందరి వాడు, శంకర్ దాదా జిందాబాద్, ఖైదీ నంబర్ 150 వంటి సినిమాలొచ్చాయి. ఈ మూడు కూడా సూపర్ హిట్స్ అనిపించుకున్నాయి. మళ్లీ ఇన్నేళ్ల విరామం తరువాత మెగాస్టార్ సినిమాకు దేవి సంగీతం అందిస్తున్నాడు. ఈ ఇద్దరిది సక్సెస్ రికార్డ్. అంతే కాకుండా మైత్రీ బ్యానర్ లో ఇప్పటికే దేవి డబుల్ హ్యాట్రిక్ హిట్ లని అందించాడు.
శ్రీమంతుడు నుంచి పుషకప వరకు మైత్రీలో డబుల్ హ్యాట్రిక్ ని సాధించిన డీఎస్పీ ఇప్పడు మెగాస్టార్ మూవీలో మరో హ్యాట్రిక్ కి శ్రీకారం చుడుతున్నాడు. చిరు నుంచి ఆయన మార్కు మ్యూజికల్ హిట్ మూవీ వచ్చి చాలా రోజులవుతోంది. చిరుతో దేవి చేసిన నటించిన శంకర్ దాదా ఎంబీ బిఎస్, అందరి వాడు, శంకర్ దాదా జిందాబాద్, ఖైదీ నంబర్ 150 వంటి సినిమాలు ఆడియోతో ముందు భారీ క్రేజ్ ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
అదే స్థాయిలో చిరు నటిస్తున్న 154వ ప్రాజెక్ట్ కూడా మ్యూజికల్ బ్లాక్ బస్టర్ గా క్రేజ్ ని దక్కించుకోవాలంటే ఆ బధ్యతని తన వేసుకున్న దేవి మరో సారి తనదైన స్టైల్లో మ్యాజిక్ చేయాల్సిందే. చిరు కూడా దేవి శ్రీప్రసాద్ నుంచి ఇదే కోరుకుంటున్నాడట.
'గాడ్ పాదర్' కు తమన్ ఆశించిన స్థాయి బజ్ ని క్రియేట్ చేయలేక కాపీ విమర్శల్ని ఎదుర్కోవడంతో 154 ప్రాజెక్ట్ బాధ్యతల్ని దేవిపై పెట్టాడట. చిరు. దేవి ట్రాక్ రికార్డు ప్రకారం ఈ మూవీతో దేవి తన మ్యాజిక్ ని కంటిన్యూ చేస్తాడా?.. చిరు ఫ్యాన్స్ ని మెప్పిస్తాడా? అన్నది తెలియాలంటే ఫస్ట్ సింగిల్ బయటికి వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
దీపావళి రోజున ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ ని కూడా చిత్ర బృందం రిలీజ్ చేయబోతోంది. దీంతో దేవి పని తనం కూడా కొంత మూరకు బయటపడే అవకాశం వుందని తెలుస్తోంది. ఇదిలా వుంటే మెగాస్టార్ ఊరమాస్ పాత్రలో కనిపించనున్న ఈ మూవీకి 'వాల్తేరు వీరయ్య' అనే టైటిల్ ని చిత్ర బృదం దీపావళి రోజున కన్ఫర్మ్ చేయబోతోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.