Begin typing your search above and press return to search.
దిల్ రాజు సొంత లాభం మానుకుంటాడా?
By: Tupaki Desk | 9 Nov 2022 2:30 AM GMTమొన్న దీపావళి పండక్కి ఏకంగా నాలుగు సినిమలు రిలీజయ్యాయి. వాటి కంటే ముందు వచ్చిన ‘కాంతార’ సినిమాకు మంచి వసూళ్లు వస్తున్నా సరే.. కొత్త చిత్రాల కోసం దానికి థియేటర్లు తగ్గించేశారు. మంచి మంచి థియేటర్ల నుంచి ‘కాంతార’ను లేపేసి కొత్త సినిమాలను వేస్తే వసూళ్లు లేక వెలవెలబోయాయి.
తప్పక వారం రోజులు ఆడించి ఆ తర్వాత మళ్లీ ‘కాంతార’తో రీప్లేస్ చేశారు. బాగా ఆడుతున్న సినిమాను తీసేయడం.. కొత్త సినిమాలకేమో వసూళ్లు లేకపోవడం విడ్డూరంగా అనిపించింది. ఆ టైంలోనే మంచి టాక్ తెచ్చుకున్న ‘సర్దార్’కు కూడా సరిపడా థియేటర్లు దక్కలేదు. సంక్రాంతికి కూడా ఇలాంటి పరిస్థితి కనిపిస్తుందేమో అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
సంక్రాంతి పండక్కి ‘వాల్తేరు వీరయ్య’, ‘వీరసింహారెడ్డి’ చిత్రాలతో పాటు తమిళ అనువాద చిత్రం ‘వారసుడు’ కూడా రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో క్రేజ్ అంతా చిరు, బాలయ్య సినిమాలకే ఉంది. ‘వారసుడు’కు అయితే ఇప్పటిదాకా పెద్దగా బజ్ కనిపించడం లేదు.
ఐతే ఈ సినిమాను నిర్మిస్తున్నది దిల్ రాజు. నైజాంలో మెజారిటీ థియేటర్లు ఆయన చేతుల్లోనే ఉన్నాయి. ఏపీలోనూ థియేటర్లపై ఆయనకు పట్టుంది. తన సినిమా కోసం ఆయన మేజర్ స్క్రీన్లను ఆపుకుంటున్నారనే చర్చ జరుగుతోంది. దీని వల్ల చిరు, బాలయ్య సినిమాలకు సరిపడా స్క్రీన్లు దొరికే అవకాశం కనిపించడం లేదు.
ఐతే దీపావళికి ఏం జరిగిందో చూసుకుని డిమాండ్ ఉన్న చిత్రాలకు మెజారిటీ స్క్రీన్లు ఇవ్వడం గురించి దిల్ రాజు ఆలోచించాలని, సొంత లాభం కొంత మానుకోవాలని.. ‘వారసుడు’ తమిళ వెర్షన్ మీద దృష్టిపెట్టి తెలుగు మీద ఫోకస్ తగ్గిస్తే మంచిదనే అభిప్రాయాలు ఇండస్ట్రీలో వ్యక్తమవుతున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.