Begin typing your search above and press return to search.
శంకర్ కాంప్రమైజ్ అయ్యారా..ప్చ్!!
By: Tupaki Desk | 16 July 2019 4:57 AM GMTభారతీయ దర్శకుల్లో అన్ కాంప్రమైజ్డ్ డైరెక్టర్ గా శంకర్ గురించి గొప్పగా చెబుతారు. తను ఏ సినిమా చేసినా దాని బడ్జెట్ తను అనుకున్న స్థాయిలో వుండాల్సిందే. ఇప్పటివరకూ ఆయన తీసిన సినిమాలు బడ్జెట్ల పరంగాను.. భారీతనంలోనూ ఏమాత్రం తీసికట్టుగా లేవు. శంకర్ రాజీలేని మనస్తత్వానికి అతడు తీసిన సినిమాల్లో కొన్ని సీన్లే ఎగ్జాంపుల్. రజనీ `2.ఓ`లో సెల్ ఫోన్ వాకింగ్ సీన్ ఒక్కటి చాలు. ఆ సన్నివేశంలో మొబైల్స్ వాక్ చేస్తూ ఎక్కడికి వెళ్లిపోతున్నాయని తన అసిస్టెంట్ వెన్నెలతో కలిసి వెతికే పనిలో గళ్లీలన్నీ తిరుగుతుంటాడు రజనీ. ఆ సన్నివేశాల్లో ఓ వీధిలో రజనీ ఓ పడవలాంటి కార్ లో కనిపిస్తారు. అక్కడ వాడింది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారు. ఆ సన్నివేశంలో ఆ కారు అవసరం లేదు.. కానీ శంకర్ కావాలంటే కావాలి అంతే. అలాంటి రాజీకి రాని వ్యక్తిత్వం కారణంగానే శంకర్ తెరకెక్కించబోతున్న `ఇండియన్-2` చిత్రీకరణ దశలోనే రకరకాల ఇబ్బందులు ఎదుర్కొంటోందని ప్రచారమైంది. శంకర్ కెరీర్‌లో ఈ రేంజులో బ్రేకులు పడడం అన్నది ఇదే తొలిసారి. చిత్రీకరణ దశలో ఓ సినిమా ఆగిపోవడం అన్నది ఇది రెండోసారి.
కొన్నేళ్ల క్రితం `రోబో` చిత్రాన్ని కమల్‌హాసన్‌తో చేయాలని ట్రయల్ షూట్ చేశారు శంకర్. అయితే బడ్జెట్.. అనుకున్న సాంకేతికత అందుబాటులో లేకపోవడంతో దాన్ని మధ్యలోనే ఆపేశారు. ఆ తర్వాత మధ్యలో ఎన్నో సినిమాలు చేశారు శంకర్. కానీ ఆ సీన్ మాత్రం రిపీటవ్వలేదు. కెరీర్ లో రెండోసారి అదే సీన్ `ఇండియన్-2`కు రిపీటవుతోంది. సన్నివేశాల్లో గ్రాండియారిటీ విషయంలో కానీ.. భారీ సెట్స్ విషయంలో కానీ.. ఆర్టిస్టుల విషయంలో కానీ దేనిలోనూ శంకర్ రాజీకి రానని చెప్పేయడంతో నిర్మాతలకు చిక్కొచ్చి పడింది. ఆర్థికంగా వయబిలిటీ కోసం ఈ ప్రాజెక్టును మధ్యలోనే వదిలేసేందుకు రెడీ అయ్యారు.
దీంతో ప్రాజెక్టు ఏదీ తేలని సన్నివేశంలో అంతకంతకు ఆలస్యమవుతోంది. ఈ ఆలస్యం భరించలేక ఎంతో కాలంగా వేచి చూసిన కథానాయిక కాజల్ సైతం సినిమా నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే ప్రాజెక్టు విషయమై ఎంతో ఆలోచించిన శంకర్ మనసు మార్చుకున్నారట. నిర్మాత సుభాష్కరన్ ఏ బడ్జెట్ ఇస్తే అదే బడ్జెట్‌లో `ఇండియన్-2`ని పూర్తి చేస్తానని శంకర్ కాంప్రమైజ్ అయినట్టు తెలుస్తోంది. ఈ ఒప్పందానికి నిర్మాత కూడా ఓకే చెప్పారని.. ఆగస్టు రెండో వారంలో తిరిగి `భారతీయుడు 2` పట్టాలెక్కబోతోందని తెలుస్తోంది. శంకర్ లాంటి దర్శకుడు కాంప్రమైజ్ కావడం వల్లే ఇండియన్-2`కు మోక్షం లభిస్తోందని తమిళ మీడియా తాజాగా కథనాలు వండి వారుస్తోంది.
ఓవైపు ఈ ప్రాజెక్టు ఆలస్యమవుతుంటే.. కథానాయకుడు కమల్ హాసన్ మాత్రం ఇవేవీ పట్టనట్టు కుదిరితే రాజకీయాలు.. కుదరకపోతే బిగ్‌బాస్ చూసుకుంటూ తన టైమ్ ని స్పెండ్ చేస్తున్నారట. ఇక శంకర్ రాజీకొచ్చారు కాబట్టి రీస్టార్ట్ అవుతున్నట్టే. అయితే శంకర్ నుంచి ఆశించే ఆ విజువల్ గ్రాండియారిటీ లేకపోతే ప్రేక్షకులు థియేటర్లకు రిపీటెడ్ గా వచ్చే విషయంలో రాజీకొస్తారా? అన్నది నిర్మాతలే ఆలోచించుకోవాల్సి ఉంటుంది. 2.ఓ సినిమా దాదాపు మూడు సంవత్సరాలకు పైగానే షూటింగ్ జరుపుకుంది. ఈసారి అంత సమయం పట్టకుండా శంకర్ ఎలా ప్లాన్ చేస్తారు? అన్నది వేచి చూడాల్సిందే.