Begin typing your search above and press return to search.

బాబాయ్ కోసం అబ్బాయ్ ఆగుతాడా? సై అంటాడా?

By:  Tupaki Desk   |   16 Feb 2022 3:39 AM GMT
బాబాయ్ కోసం అబ్బాయ్ ఆగుతాడా? సై అంటాడా?
X
కరోనా మ‌హ‌మ్మారీ మాయాజాలం టాలీవుడ్ పై ఇంకా బ‌లంగానే ప‌ని చేస్తోంది. ముఖ్యంగా సినిమాల రిలీజ్ డేట్ల‌పై తీవ్ర ప్ర‌భావం చూపుతోంది. ఎవ‌రికీ ఊపిరాడ‌నివ్వ‌డం లేదు. థ‌ర్డ్ వేవ్ ప్ర‌భావం అంతంత మాత్రంగానే ఉన్నా కానీ సినిమా ప‌రిశ్ర‌మ‌కు తంటాలు త‌ప్ప‌డం లేదు.

తాజాగా భీమ్లా నాయ‌క్ రిలీజ్ తేదీ ప్ర‌క‌ట‌న అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఇప్ప‌ట్లో రారు అనుకున్నవారంద‌రికీ ఇది బిగ్ షాక్. పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ చిత్రాన్ని ఫిబ్రవరి 25న విడుదల చేయనున్నట్లు మొదట్లో ప్రకటించారు. భీమ్లా టీమ్ ఇంకా వేచి చూసే విధానంలో ఉన్నందున పరిస్థితులు మారిపోయాయి. చాలా మంది చిత్రం ఏప్రిల్ 1కి వాయిదా పడిందని భావించారు.

ఏపీలో వంద శాతం ఆక్యుపెన్సీ అనుమతించేంత వరకు తమ సినిమాను విడుదల చేయబోమని భీమ్లా నాయక్ నిర్మాతలు కూడా అధికారికంగా చెప్పారు. ఇదే అవకాశంగా భావించిన శర్వా ఆడవాళ్లు మీకు జోహార్లు.. వరుణ్ తేజ్ గ‌ని ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ప్రకటించారు.

అయితే ఇంత‌లోనే అంతా మారిపోయింది. భీమ్లా నాయ‌క్ ఫిబ్రవరి 25న విడుదలకు వ‌స్తోంద‌ని నిర్మాత‌లు స‌డెన్ గా ప్ర‌క‌టించారు. అయితే ప‌వ‌ర్ స్టార్ నిర్ణ‌యం ఇత‌రుల‌కు తీవ్ర ఇబ్బందిక‌రం. అబ్బాయ్ వ‌రుణ్ తేజ్ సినిమాకి కూడా ఇది చాలా డేంజ‌ర్ అని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా రెండేళ్లుగా నిర్మాణంలో ఉండగా పలుమార్లు వాయిదా పడింది. ఇప్పుడు భీమ్లా కూడా వస్తున్నందున గ‌ని వాయిదా పడటం ఖాయం అని భావిస్తున్నారు.

నిజానికి ఆడవాళ్లు మీకు జోహార్లు.. గ‌ని చిత్రాల‌కు స‌రైన ప్ర‌మోష‌న్ ఇప్ప‌టివ‌ర‌కూ లేదు. ఇక‌పై అయినా క్లారిటీ ముందుకు వెళ్లాలి అనుకుంటుండ‌గానే భీమ్లా నాయ‌క్ రిలీజ్ కి వ‌స్తోంది. దీంతో ఇరు టీమ్ ల‌లో ఆలోచించుకోవాల్సిన స‌న్నివేశం ఏర్ప‌డింది. నిజానికి ఏపీలో టికెట్ రేట్ల అంశం కూడా భీమ్లా ఆలోచించుకునేందుకు కార‌ణ‌మైంది.

టికెట్ రేట్లు పెంచుతార‌నుకుంటే అది జ‌ర‌గ‌లేదు. ఇక‌పై అయినా జ‌రుగుతుందా అంటే న‌మ్మ‌కం లేదు. అందుకే ఇప్పుడు స‌డెన్ గా భీమ్లా నాయ‌క్ డేట్ ప్ర‌క‌టించేశార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా కానీ ఇది అబ్బాయ్ కి బాబాయ్ వ‌ల్ల ఇబ్బంది. బాబాయ్ ప‌వ‌న్ క‌ల్యాణ్ కోసం అబ్బాయ్ వ‌రుణ్ తేజ్ త‌న రిలీజ్ తేదీని మార్చుకుంటాడా? అంటూ క్వ‌శ్చ‌న్ రైజ్ అయ్యింది. దీనికి కాల‌మే స‌మాధానం చెబుతుందేమో