Begin typing your search above and press return to search.

అభిమానిని 3 కోట్లు ఇవ్వమన్న రష్మీ

By:  Tupaki Desk   |   26 Aug 2018 5:55 AM GMT
అభిమానిని 3 కోట్లు ఇవ్వమన్న రష్మీ
X
సోషల్‌ మీడియాలో సెబ్రెటీలకు కొన్ని సార్లు అభిమానుల నుండి చిత్ర విచిత్రమైన ప్రశ్నలు ఎదురు అవుతూ ఉంటాయి. కొందరు సెలబ్రెటీలు వాటిని పట్టించుకోరు. కాని కొందరు మాత్రం వాటిని పట్టించుకుని అభిమానులకు తమదైన శైలిలో సమాధానాలు కూడా ఇస్తారు. తాజాగా రష్మి ట్విట్టర్‌ లో తన అభిమానికి ఇచ్చిన సమాధానం వైరల్‌ అవుతుంది. జబర్దస్త్‌ యాంకర్‌ గా మంచి గుర్తింపు దక్కించుకున్న రష్మీ తాజాగా ‘అంతకు మించి’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ చిత్రంలో రష్మీ కాస్త హద్దు మీరి అందాల ప్రదర్శణ చేసిన విషయం తెల్సిందే. ఆ చిత్రం ప్రమోషన్‌ లో భాగంగా సోషల్‌ మీడియాలో అభిమానులతో చిట్‌ చాట్‌ చేసింది.

ఆ సమయంలో ఒక అభిమాని రష్మీతో మీరు ఇతర దర్శకుడు అవకాశం ఇచ్చే వరకు ఎదురు చూడకుండా - మీరే వరుసగా చిత్రాలు చేయవచ్చు కదా అంటూ సూచించాడు. రష్మీ నుండి వరుసగా ఆయన సినిమాలను కోరుకుంటూ ఉన్నాడు. ఆయన ప్రశ్నకు సమాధానంగా రష్మీ కాస్త చెలాకీగా స్పందించింది. మీకు నా అకౌంట్‌ డీటైల్స్‌ పంపిస్తాను. నా అకౌంట్‌లో 3 కోట్లు వేయండి. నేనే సొంతంగా సినిమాను చేస్తాను అంటూ చెప్పుకొచ్చింది. రష్మీ సమయస్ఫూర్తిగా చెప్పిన ఆ సమాధానంగా అంతా కూడా ఫిదా అయ్యారు. పిచ్చి ప్రశ్నలు వేయకుండా కాస్త మంచి ప్రశ్నలు వేయండి అంటూ ఆ తర్వాత రష్మీ అభిమానులను కోరింది.

రష్మీ గతంలో కూడా పలు సార్లు అభిమానులు అడిగిన ప్రశ్నలకు గడుసుగా సమాధానం చెప్పింది. ఇక బోల్డ్‌ పాత్రలను మీరు ఎందుకు చేస్తున్నారు - యాంకర్‌ గానే మీరు కొనసాగాలని కోరుకుంటున్నాం అంటూ ఒక వ్యక్తి ట్వీట్‌ చేయగా - నాకు ఒక రంగంలోనే సెటిల్‌ అయ్యి పోవాలి అనే ఆలోచన లేదు. అన్ని రంగాల్లో కూడా అలరించాలనేది నా కోరిక. అందుకే యాంకరింగ్‌ తో పాటు - నటనపై కూడా దృష్టి పెడుతున్నాను అంటూ చెప్పుకొచ్చింది. రష్మీ ఇంకా పలువురు అడిగిన వింత ప్రశ్నలకు ఓపికగా సమాధానం చెప్పి అభిమానులను సంతోష పెట్టింది.