Begin typing your search above and press return to search.
ట్విట్టర్ కోసం కోర్టుకి వేళతాడట
By: Tupaki Desk | 20 Oct 2017 4:07 AM GMTసోషల్ మీడియా ప్రభావంతో ప్రస్తుత రోజుల్లో కొందరు విమర్శకులు ఇష్టం వచ్చినట్లు కామెంట్స్ చేయడం కామన్ అయ్యింది.స్టార్ హోదా కలిగిన వారిపై కామెంట్స్ చేస్తూ.. వారి ఇమేజ్ ను పెంచుకోవాలని చూస్తున్నారు. బాలీవుడ్ లో గత కొంత కాలంగా ఇదే తరహాలో ఎన్నో విమర్శలను చేసిన నటుడు దర్శకుడు కమాల్ ఆర్ ఖాన్. ఇండియాలో ట్విట్టర్ గురించి తెలిసిన వారికి ఈ వ్యక్తి గురించి కూడా బాగా తెలిసుండాలి.
హిందీ సినిమాలను అడ్వాన్స్ గా దుబాయ్ లో చూసేసి విమర్శలు చేస్తూ ఉండే కమల్ కు దీపావళి రోజు దిమ్మ తిరిగే షాక్ తగిలింది. అతనిపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు రావడంతో ట్విట్టర్ అతని అకౌంట్ ని రద్దు చేసింది. దీంతో నెటీజన్స్ పీడ విరగడయిందని పండగ చేసుకుంటున్నారు. అడ్డమైన రివ్యూలు రాసే కేఆర్‌కే అకౌంట్ ను నిలిపివేయడంతో చాలా మంది నెటీజన్స్ పాజిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు.
అయితే కేఆర్ కే మాత్రం న్యాయపోరాటం చేస్తానని అంటున్నాడు. కష్టపడి నా కామెంట్స్ తో మిలియన్ల ఫాలోవర్స్ ని సంపాదించుకుంటే ఇలా నా అకౌంట్ ని డిలీట్ చేస్తారా అని చెబుతూ.. కోర్టుకి వెళతానని చెప్పాడు. కేఆర్ కే టాలీవుడ్ హీరోలపై పలుమార్లు కొన్ని అసభ్యకరమైన కామెంట్స్ చేశాడు. అల్లు అర్జున్ పై అయితే చాలా నెగిటివ్ ట్వీట్ చేశాడు. అలాగే బాహుబలి 2 రిలీజ్ అయినపుడు కూడా చాలా చెత్త సినిమా అన్న అతను రికార్డులు బద్దలైన తర్వాత క్షమాపణ చెప్పాడు.