Begin typing your search above and press return to search.
గాడ్ ఫాదర్.. టాలీవుడ్ కు చిట్టచివరి రీమేక్ కానుందా?
By: Tupaki Desk | 29 Sep 2022 5:30 AM GMTమలయాళంలో సూపర్ హిట్ అయిన లూసిఫర్ ను తెలుగులో గాడ్ ఫాదర్ గా రీమేక్ చేసిన విషయం తెలిసిందే. నిజానికి ఈ సినిమాను లూసిఫర్ పేరుతో తెలుగులోనూ విడుదల చేశారు కానీ.. ఎప్పుడు రిలీజ్ అయ్యిందో.. ఎప్పుడు బాక్సులు వెనక్కి వెళ్లిపోయాయో తెలీని పరిస్థితి. ఎప్పుడైతే మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమా చేయటానికి ఆసక్తి చూపుతున్నారన్న విషయం తెలిసినంతనే.. ఓటీటీలో దీన్ని పెద్ద ఎత్తున చూసేశారు.
ఇప్పుడా లూసిఫర్ కాస్తా గాడ్ ఫాదర్ గా మారి దసరా పండక్కి కనువిందు చేయటానికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఒరిజినల్ కథకు కొన్ని మార్పులు చేయటంతో పాటు.. మోగాస్టార్ ఇమేజ్ కు తగ్గట్లుగా చేర్పులు చేయటం ద్వారా.. సినిమాను మరింత ఆకర్షణీయంగా మార్చారని చెబుతున్నారు. ఇప్పటివరకు రిలీజ్ అయిన ప్రచార చిత్రాలు ఈ సినిమా మీద ఆసక్తిని రేకెత్తించేలా మారాయి.
ఇదంతా బాగానే ఉన్నా.. ఇలాంటి సినిమాకు రావాల్సిన స్పందన రాలేదన్న టాక్ నడుస్తోంది. లుక్ పరంగానూ.. ట్రీట్ మెంట్ పరంగాను అత్యుత్తమంగా ఈ సినిమాను సిద్ధం చేసిన విషయం ట్రైలర్ ను చూసినంతనే అర్థమవుతుంది. మరి.. ఎందుకు ఒకలాంటి స్తబ్దత ఉందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. నిజానికి ఒక సినిమాను రీమేక్ చేస్తున్నప్పుడు ఆసక్తి.. అంచనాలు ఎక్కువగా ఉంటాయి. కానీ.. ఇటీవల చోటు చేసుకున్న కొన్ని మార్పులు.. కొత్త సమస్యను ఎదుర్కొనేలా చేస్తున్నాయి. ఇప్పుడు గాడ్ ఫాదర్ విషయంలోనూ అలాంటిదే నెలకొందన్న మాట వినిపిస్తోంది.
చిరంజీవి గాడ్ ఫాదర్ చేస్తున్నారన్నంతనే.. దాని ఒరిజినల్ అయిన లూసిఫర్ ను రెండు.మూడుసార్లకు పైనే చూసినోళ్లు చాలామంది ఉన్నారు. ఆ మాటకు వస్తే.. చిరు ఓకే చేయటం ఒరిజినల్ మూవీకి వరంగా మారి.. ఓటీటీ వీక్షకుల సంఖ్య భారీగా ఉండేలా చేసింది. ఇప్పుడు తెలిసిన కథే కావటంతో.. ప్రేక్షకుల్లో ఉండాల్సిన ఉత్సుకత ఉండని పరిస్థితి. ఆ మాటకు వస్తే గాడ్ ఫాదర్ మూవీకి ఓపెనింగ్స్ ఉండవా? అంటే ఎందుకు ఉండవు. కానీ.. ఒక మామూలు సినిమాకు ఉండే ఆసక్తి అంతగా ఉండని పరిస్థితి.
మెగాస్టార్ సినిమాకే ఇలాంటి పరిస్థితి ఉంటే.. ఇక మామూలు హీరోల పరిస్థితి మరింత ఇబ్బందికరంగా ఉంటుందంటున్నారు. ఓటీటీ పుణ్యమా అని.. ఇకపై రీమేక్ మూవీలకు కాలం చెల్లినట్లే అన్న మాట వినిపిస్తోంది. ఒక విధంగా చూస్తే.. గాడ్ ఫాదర్.. స్టార్ హీరో చేసిన చిట్టచివరి రీమేక్ గా ఉండే అవకాశం ఉందంటున్నారు.
గతంలో రీమేక్ మూవీకి ఉండే బజ్.. ఇప్పుడు ఉండటం లేదు. ఇటీవల విడుదలైన రీమేక్ సినిమాల ఫలితంలో బాలీవుడ్ కూడా చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. దీని స్థానే మంచి కథను మరింత జాగ్రత్తగా వండి.. దానికి బజ్ తీసుకొస్తే.. పాన్ ఇండియా మూవీగా మార్చేయొచ్చన్న మాట వినిపిస్తోంది. మొత్తంగా చూస్తే.. ఓటీటీ రీమేక్ మూవీలను మింగేసినట్లే అన్న అభిప్రాయం పరిశ్రమ వర్గాల్లోనూ హాట్ టాపిక్ గా మారింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.