Begin typing your search above and press return to search.
`హిట్ 2` మండే టెస్ట్ అధిగమిస్తుందా?
By: Tupaki Desk | 5 Dec 2022 1:30 AM GMTఅడివి శేష్ హీరోగా నటించిన ఇన్వెస్టిగేటివ్ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ `హిట్ 2`. శైలేష్ కొలను దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని నిర్మించిన ఈ మూవీ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన `హిట్ ది ఫస్ట్ కేస్` అనూహ్య విజయాన్ని సాధించడం.. వరుస విజయాల్ని సొంతం చేసుకుంటూ దూసుకుపోతున్న క్రేజీ హీరో అడివి శేష్ నటించిన మూవీ కావడం.. ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ లు ఆసక్తిని రేకెత్తించడంతో ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.
డీకే పాత్రలో అడివి శేష్ నటించిన ఈ మూవీ శుక్రవారం ఫస్ట్ రోజే ఫస్ట్ షోతో పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్నఈ మూవీ ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా రూ.11.27 కోట్ల గ్రాస్ ని రాబట్టింది. యుఎస్ లో500 కె డాలర్స్ ని రాబట్టింది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ మంచి వసూళ్లిని రాబట్టడమే కాకుండా మంచి టాక్ తో ప్రదర్శింపబడుతోంది. ఓవర్సీస్ లో హాఫ్ మిలియన్ క్రాస్ చేసిన ఈ మూవీ శినవారం కూడా మంచి వసూళ్లని రాబట్టింది.
ఆదివారం కూడా ఈ మూవీ అదే స్థాయి వసూళ్లని రాబట్టేలా కనిపిస్తోంది. ఫస్ట్ డే పాజిటివ్ టాక్ రావడంతో ఈ మూవీ కలెక్షన్ లు స్టడీగా వున్నాయి. ఇప్పటకే 70 శాతం బ్రేక్ ఈవెన్ ని సాధించిన ఈ మూవీ తొలి వారాంతానికి దాదాపుగా అన్ని ఏరియాల్లోనూ సేఫ్ జోన్ లోకి రావడం ఖాయం అని చెబుతున్నారు. ఫస్ట్ రోజే ఓవర్సీస్ లో హఫ్ మిలియన్ మార్కుని దాటిన ఈ మూవీ ప్రస్తుతం 700 కె డాలర్లు దాటినట్టుగా తెలుస్తోంది.
త్వరలోనే ఓవర్సీస్ లో వన్ మిలియన్ మార్కుని అధిగమించడం ఖాయం అని తెలుస్తోంది. ఇదే జరిగితే `మేజర్` తరువాత ఓవర్సీస్ లో వన్ మిలియన్ మార్కుని అధిగమించిన అడివి శేష్ రెండవ సినిమాగా `హిట్ 2` నిలబోతోందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం టెస్ట్ ని `హిట్ 2` చాలా సులువుగా దాటే అవకాశం వుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ మూవీకి ఇంత క్రేజ్ రావడానికి ప్రధాన కారణం హీరో నాని చేసిన ప్రమోషన్స్. మండే టెస్ట్ ని అధిగమించి ఈ మూవీ లాంగ్ రన్ అవుతుందో వేచి చూడాల్సిందే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.