Begin typing your search above and press return to search.
బాలీవుడ్ కు కొత్త ఊపునిస్తుందా..ఉసూరుమనిపిస్తుందా?
By: Tupaki Desk | 26 Oct 2022 1:30 PM GMTబాలీవుడ్ గత కొన్ని నెలలుగా గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటోంది. ఇండియన్ సినిమా అంటే ఇకప్పుడు బాలీవుడ్ మాత్రమే. కానీ ఆ లెక్కలన్నీ మారిపోవడం.. ఇండియన్ సినిమా అంటే అర్థం మారిపోవడంతో గత కొంత కాలంగా బాలీవుడ్ సినిమాలకు విపత్కర పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత మోగించిన స్టార్స్ కూడా కనీసం హిట్ ని కూడా సొంతం చేసుకోలేకపోతున్నారు. అమీర్ ఖాన్ నటించిన 'లాల్ సింగ్ చడ్డా', రణ్ బీర్ కపూర్ నటించిన 'బ్రహ్మాస్త్ర' ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయాయి.
అంతకు ముందు విడుదలైన అక్షయ్ కుమార్ 'సామ్రాట్ పృథ్వీరాజ్', రక్షా బంధన్, షంశేరా దారుణ ఫలితాన్ని అందించి బాలీవుడ్ హిస్టరీలోనే అతి పెద్ద డిజాస్టర్లుగా నిలిచాయి. దీంతో బాలీవుడ్ పరిస్థితేంటీ?.. ఇప్పట్లో కోలుకోవడం కష్టమేనా అనే అనుమానాలు మొదలయ్యాయి. రీసెంట్ గా విడుదలైన సూపర్ హిట్ రీమేక్ 'విక్రమ్ వేద' కూడా బాలీవుడ్ ని కాపాడలేక నిరుత్సాహాన్ని కలిగించింది. హృతిక్ రోషన్, సైఫ్ అలీఖాన్ కలిసి నటించిన ఈ మూవీ ఆశించిన స్థాయిలో వసూళ్లని రాబట్టలేకపోయింది.
దీపావళి సందర్భంగా విడుదలైన 'రామ్ సేతు' 'థాంక్ గాడ్'తో అయినా బాలీవుడ్ మళ్లీ పుంజుకుంటుందని ఆశించారు. అదీ జరగడం లేదని స్పష్టమైంది. ఈ రెండు సినిమాలకు బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ రావడం, ఆయుష్మాన్ ఖురానా నటించిన 'డాక్టర్ జీ'కి టాక్ బాగున్నా వసూళ్లు మాత్రం ఆ స్థాయిలో లేకపోవడంతో అంతా ఇప్పడు కత్రినా కైఫ్ పై ఆశలు పెట్టుకుంటున్నారు. దక్షిణాది సినిమా 'కాంతార' హిందీలో తనదైన హవాని కొనసాగిస్తున్నా ఆ స్థాయిలో బాలీవుడ్ సినిమాలు మాత్రం ఆకట్టుకోలుక చేతులెత్తేస్తున్నాయి.
ఆయుష్మాన్ ఖురానా నటించిన 'డాక్టర్ జీ'కి మంచి టాక్ వున్నా ఆ స్థాయిలో వసూళ్లు రావడం లేదట. ఇక అనఫీషియల్ రీమేక్ గా రూపొందిన 'థాంక్ గాడ్', అక్షయ్ కుమార్ నటించిన 'రామ్ సేతు' కూడా బాక్సాఫీస్ వద్ద చేతులు ఎత్తేసి షాకిచ్చాయి. ఈ నేపథ్యంలో అంతరి చూపు కత్రినా కైఫ్ నటించిన 'ఫోన్ బూత్' పై పడింది. ఇషాన్ కట్టర్, సిద్దార్ధ్ చతుర్వేదీ నటించిన ఈ మూవీలో కత్రినా భూతంగా నటించిన విషయం తెలిసిందే.
రొమాంటిక్ ఫన్ లాఫ్టర్ గా తెరకెక్కిన ఈ మూవీతో కత్రినా బాలీవుడ్ కు బిగ్ హిట్ ని అందించడం ఖాయం అని అంటున్నారు. ఆ మధ్య కార్తీక్ ఆర్యన్ నటించిన 'భూల్ బులయ్యా 2'లో బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకుని ఆశ్చర్యపరిచిన విషయం తెలిసిందే. అదే తరహాలో కత్రినా కైఫ్ కూడా 'ఫోన్ బూత్ ' మూవీతో బ్లాక్ బస్టర్ ని సొంతం చేసుకోవడం ఖాయం అని బాలీవుడ్ వర్గాలు ఆశగా ఎదురుచూస్తున్నాయి. మరి కత్రినా బ్లాక్ బస్టర్ తో బాలీవుడ్ కు సరికొత్త ఊపుని తీసుకొస్తుందా? లేక ఉసూరుమనిపిస్తుందా? అన్నది నవంబర్ 4 వరకు వేచి చూడాల్సిందే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.