Begin typing your search above and press return to search.

ఇప్పుడు రీమేక్ మాట ఎత్తుతారా ?

By:  Tupaki Desk   |   30 July 2019 11:29 AM GMT
ఇప్పుడు రీమేక్ మాట ఎత్తుతారా ?
X
డియర్ కామ్రేడ్ విడుదలకు సరిగ్గా ఒక్క రోజు ముందు దీన్ని హిందీలో రీమేక్ చేస్తానని ట్విట్టర్ లో గర్వంగా ప్రకటించిన కరణ్ జోహార్ ఇప్పుడు నిజంగా ముందుకు వెళ్తారా అంటే ఏమో డౌట్ అంటున్నాయి ముంబై వర్గాలు. కారణం ఇక్కడ దానికి దక్కిన ఫలితం. ఊహించని విధంగా ఏ భాషలోనూ కామ్రేడ్ కు గ్రాండ్ వెల్కమ్ దక్కలేదు. పోనీ తెలుగు వెర్షన్ అయినా నష్టాలు రాకుండా కాపాడుతుందా అంటే అదీ జరిగేలా కనిపించడం లేదు.

యుఎస్ లో ఐదో రోజూ మిలియన్ మార్క్ అనుమానమే అంటున్నారు. ఫస్ట్ వీక్ లోపే ఆ మొత్తం వస్తే అక్కడి బయ్యర్ అంతో ఇంతో సేఫ్ అయ్యే ఛాన్స్ ఉండేది. కానీ ఇప్పుడు దానికే వారం పైగా పడితే పెట్టుబడి మొత్తం వెనక్కు రావడం అయ్యే పని కాదు. అక్కడి టాక్ సైతం ఇక్కడికి భిన్నంగా ఏమి లేదు. సో కరణ్ జోహార్ ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం వేస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.

అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ కబీర్ సింగ్ ఏకంగా 300 కోట్లకు పైగా రాబట్టడం చూసి కరణ్ జోహార్ టెంప్ట్ అయ్యారు తప్పించి ఒక్క రెండు రోజులు ఆగి కామ్రేడ్ రీమేక్ ప్రకటన చేసి ఉంటే బాగుండేదని అక్కడి విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ మార్పులు చేసినా ఈ సబ్జెక్టుని ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా రీ రైట్ చేయడం అంత ఈజీ కాదు. దాని బధులు కొత్త కథకు స్క్రిప్ట్ రాసుకోవడం ఉత్తమం. డియర్ కామ్రేడ్ విడుదలయ్యాక ముంబై సెలెబ్రిటీల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం గమనార్హం. సో రీమేక్ సంగతి ప్రకటనకే పరిమితం కావొచ్చు