Begin typing your search above and press return to search.
NIA అధికారిగా కార్తికేయ ఛాలెంజ్ నెగ్గుతాడా?
By: Tupaki Desk | 20 Jun 2021 8:16 AM GMTజయాపజయాలకు అతీతంగా ప్రతి సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న హీరో కార్తికేయ. డ్యాన్సులు ఫైట్స్ తో పాటు భావోద్వేగాలు అద్భుతంగా పలికించే నటుడిగా ప్రశంసలు అందుకున్నారు. ఆర్.ఎక్స్ 100లో విఫల ప్రేమికుడిగా నటించి మెప్పించాడు. గ్యాంగ్ లీడర్ లో స్టయిలిష్ విలన్ గానూ మెప్పించారు. కెరీర్ లో ఎన్నో విలక్షణ పాత్రలతో సర్ ప్రైజ్ చేయాలన్నది కార్తికేయ ఆలోచన. ఇప్పుడు యాక్షన్ ఎంటర్ టైనర్ `రాజావిక్రమార్క`తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
కార్తికేయ గుమ్మకొండ కథానాయకుడిగా శ్రీ చిత్ర మూవీ మేకర్స్ పతాకంపై ఆదిరెడ్డి .టి సమర్పణలో 88 రామారెడ్డి ఓ సినిమా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. హీరోగా కార్తికేయ 7వ చిత్రమిది. వి.వి. వినాయక్ శిష్యుడు శ్రీ సరిపల్లి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రానికి `రాజావిక్రమార్క` అనే టైటిల్ ఖరారు చేశారు. తాజాగా హీరో ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. టైటిల్ ప్రకటనతో పాటు సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను అర్జున్ రెడ్డి-కబీర్ సింగ్ చిత్రాల దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఆదివారం సోషల్ మీడియాలో విడుదల చేశారు.
ఇదొక యాక్షన్ ఎంటర్ టైనర్. కార్తికేయ నటన- పాత్ర చిత్రణ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే చిత్రమిది. చిత్రీకరణ చాలావరకూ పూర్తయింది. లాక్ డౌన్ ఆంక్షలు పూర్తిగా సడలించిన తర్వాత మిగతా భాగం పూర్తి చేసి విడుదల చేయనున్నారు.
ఈ సినిమాలో కొత్తగా ఎన్.ఐ.ఏ (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ)లో జాయిన్ అయిన అధికారిగా హీరో కార్తికేయ కనిపిస్తారు. పాత్రలో ఆయన ఒదిగిపోయి నటించారు. యాక్షన్ సన్నివేశాలను స్పెషల్ గా ఉంటాయి. సీనియర్ తమిళ నటులు రవిచంద్రన్ మనవరాలు తాన్యా రవిచంద్రన్ తెలుగు పరిశ్రమకు కథానాయికగా పరిచయమవుతోంది. హీరో హీరోయిన్ల మధ్య సన్నివేశాలు క్యూట్ గా ఉంటాయి. యువ సంగీత దర్శకుడు ప్రశాంత్ ఆర్. విహారి మంచి బాణీలు అందించారు అని దర్శకుడు తెలిపారు.
సుధాకర్ కోమాకుల- సాయికుమార్- తనికెళ్ళ భరణి- పశుపతి- హర్షవర్ధన్- సూర్య- జెమిని సురేష్- జబర్దస్త్ నవీన్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. పి.సి.మౌళి ఛాయాగ్రహణం.. ప్రశాంత్.ఆర్.విహారి సంగీతం అందించనున్నారు. కల్కిలో రాజశేఖర్ .. వైల్డ్ డాగ్ లో నాగార్జున ఎన్.ఐ.ఏ అధికారులుగా నటించి మెప్పు పొందారు. ఇప్పుడు కార్తికేయ తన ముందున్న లక్ష్యాన్ని ఛేదించి ఛాలెంజ్ లో నెగ్గుతారా లేదా? అన్నది చూడాలి.