Begin typing your search above and press return to search.
అక్కడ చంద్రోదయం.. ఇక్కడ ఉద్యమ సింహం
By: Tupaki Desk | 14 Nov 2018 9:28 AM GMTతెలుగులో ఇప్పుడు బయోపిక్స్ రాజ్యం నడుస్తోంది. ‘మహానటి’ సినిమా గొప్ప విజయం సాధించడంతో మరిన్ని బయోపిక్స్ తెరమీదికి వచ్చాయి. అందులోనూ ఎన్నికల సందడి మొదలైన నేపథ్యంలో బడా రాజకీయ నేతల జీవిత కథలతో సినిమాలకు సన్నాహాలు జరిగాయి. ఆల్రెడీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రులు నందమూరి తారక రామారావు.. వైఎస్ రాజశేఖర్ రెడ్డిల బయోపిక్స్ పూర్తి కావస్తున్న సంగతి తెలిసిందే. ఈ రెండు చిత్రాల మీదా ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి కూడా ఉంది. మరోవైపు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడి మీద కూడా ‘చంద్రోదయం’ పేరుతో ఓ సినిమా తీశారు. కానీ పోస్టర్ల క్వాలిటీ చూడగానే జనాలు దాని మీద కామెడీలు మొదలుపెట్టేశారు. అది ఎంతమాత్రం జనాల దృష్టిని ఆకర్షించలేదు.
ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద కూడా ఇక్కడో సినిమా తయారవుతోంది. దాని పేరు.. ఉద్యమ సింహం. నజర్ అనే నటుడు ఇందులో కేసీఆర్ పాత్ర పోషించాడు. అల్లూరి కృష్ణం రాజు ఈ చిత్రాన్ని రూపొందించాడు. దీని ఫస్ట్ లుక్ పోస్టర్ ఏమాత్రం ఆసక్తి రేకెత్తించడం లేదు. ‘చంద్రోదయం’ లాగే ఇది కూడా మొక్కుబడి సినిమాలా ఉంది. వాస్తవికంగా సినిమా తీయడం కంటే ఏదో కేసీఆర్ ను మోయడానికి ఈ సినిమా తీసినట్లుగా ఉంది. ‘ఉద్యమ సింహం’ గురించి జనాల్లో అసలు చర్చే లేదు. ఎన్నికల వేళ ఈ చిత్రం టీఆర్ఎస్ కు ఎంతమాత్రం ఉపయోగపడేలా కనిపించడం లేదు. త్వరలోనే ఈ చిత్ర ఆడియో రిలీజ్ చేస్తారట. ఎన్నికల లోపు సినిమా రిలీజ్ చేస్తే కాస్తయినా జనాల దృష్టిని ఆకర్షించొచ్చేమో కానీ.. ఈ చిత్ర బృందం ఆ దిశగా ఆలోచిస్తున్నట్లు లేదు.