Begin typing your search above and press return to search.

లక్ష్మీస్ ఎన్టీఆర్.. మే1 విడుదలవుతుందా?

By:  Tupaki Desk   |   30 April 2019 11:55 AM GMT
లక్ష్మీస్ ఎన్టీఆర్.. మే1 విడుదలవుతుందా?
X
లక్ష్మీస్ ఎన్టీఆర్.. తెలంగాణతో సహా ప్రపంచవ్యాప్తంగా అందరూ చూసిన సినిమా.. ఏపీలోని కొందరు ప్రముఖులు హైదరాబాద్ వచ్చి మరీ ఈ సినిమాను చూశారు. ఎన్టీఆర్ చివరిరోజులు, లక్ష్మీపార్వతితో సహవాసంపై రాంగోపాల్ వర్మ తీసిన ఈ చిత్రం వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది. చంద్రబాబును పక్కా విలన్ గా చూపించే ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్ లో మాత్రం విడుదల కాలేదు. ఏపీలో ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఒక పార్టీకి నష్టం చేసే ఈ సినిమాను విడుదల కాకుండా టీడీపీ నాయకులు ఫిర్యాదు చేయడం.. కోడ్ ఉండగా కుదరదని ఈసీ విడుదలను నిలిపివేయడం జరిగిపోయింది.

అయితే తాజగా రాంగోపాల్ వర్మ సహా నిర్మాతలు మే1న ఏపీలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మూవీ రిలీజ్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. తన సొంతూరు బెజవాడలో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు వర్మ కూడా ప్రమోషన్ కోసం వెళ్లగా అతడిని అడ్డుకొని తీవ్ర అడ్డంకులు సృష్టించారు. మార్చిలోనే విడుదల కావాల్సిన సినిమా మే1 వచ్చినా ఇంకా విడుదలపై స్పష్టత మాత్రం రావడం లేదు.

అయితే మే1 సినిమా విడుదల అవుతుందా లేదా అనే విషయంపై మాత్రం స్పష్టత రావడం లేదు. కోడ్ ఉండగా లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదల కావద్దంటూ ఏప్రిల్ 10న ఈసీ ఆదేశాలిచ్చింది. అయితే ఏపీలో ఏప్రిల్ 11న ఎన్నికలు ముగిశాయి. దీంతో మే 1న సినిమా విడుదల చేస్తామని నిర్మాతలు భావించారు.

అయితే తాజాగా ఏపీలో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదలకు మరో బ్రేక్ పడింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండే మే 23వ వరకు ఈ సినిమా విడుదల చేయకూడదని కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధి స్పష్టం చేశారు. ఈ విషయమై గతంలోనే నిర్మాత రాకేష్ రెడ్డికి లేఖ రాశామని తెలిపారు. అయితే కోడ్ ముగిసింది కాబట్టి విడుదల చేస్తామని వర్మ చెబుతున్నాడు. దీన్ని బట్టి నిర్మాతలు అనుకుంటున్న మే1 ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా విడుదలవుతుందా లేదా అన్నది సస్పెన్స్ గా మారింది.