Begin typing your search above and press return to search.

మిషన్ రంగస్థలం స్టార్ట్

By:  Tupaki Desk   |   9 May 2019 10:56 AM IST
మిషన్ రంగస్థలం స్టార్ట్
X
టాలీవుడ్ లోనే కాదు ప్రతి భాషలోనూ ల్యాండ్ మార్క్ గా నిలిచిన బాహుబలిని బీట్ చేయడం కమర్షియల్ సినిమాల వల్ల అంత ఈజీగా అయ్యే పని కాదు కానీ దాని తర్వాత రెండో స్థానంలో ఉన్న రంగస్థలం రికార్డులపై మహర్షి పెద్ద కన్నే వేశాడు. భరత్ అనే నేను చేయలేకపోయిన అచీవ్ మెంట్ ని దీంతో సాధించాలని అభిమానులు బలంగా కోరుకుంటున్నారు.

రంగస్థలం వచ్చి జస్ట్ ఏడాది అయ్యింది. మహర్షికి టికెట్ రేట్ల పెంపు చాలా అనుకూలిస్తోంది. అందులోనూ తెలంగాణలో చాలా చోట్ల ఉదయం 5 నుంచి 7 మధ్యలోనే బెనిఫిట్ షోలు స్టార్ట్ అయిపోయాయి. సింగల్ స్క్రీన్లలో సైతం టికెట్ ధర 200 దాకా పలికింది. ఆంధ్రాలో పరిస్థితి దీనికి భిన్నంగా ఏమి లేదు. ఎక్కడ చూసినా ఇదే హంగామా ఇదే రచ్చ

రంగస్థలం రిలీజ్ టైంలో ఇవన్నీ మిస్ అయ్యాయి. ఏపీలో వేశారు కానీ తెలంగాణలో బెనిఫిట్ షోలు పడలేదు. మాములు ధరలకే టికెట్ అమ్మకాలు సాగాయి. నిర్మాతలు ఆంధ్రలో కూడా దానికి అనుమతి అడగలేదు. అయినా రికార్డులు బద్దలయ్యాయి. రామ్ చరణ్ కెపాసిటీని చూపించాయి. ఇప్పుడు మహర్షి ముందున్న టార్గెట్ ఇదే.

రంగస్థలంని భారీ మార్జిన్ తో కాకపోయినా కనీసం దాటితే చాలు ప్రిన్స్ ఫ్యాన్స్ నిబ్బరంగా ఉండొచ్చు. మళ్ళి ఏ సాహోనో సైరానో వచ్చే దాకా రికార్డులు మహేష్ పేరు మీదే ఉంటాయి. సో మహర్షి ఈ వీకెండ్ ని ఎలా వాడుకుంటాడు ఎంత రాబడతాడు ఆ తర్వాత స్టడీగా కలెక్షన్లను ఎలా నిలబెట్టుకుంటాడు అనే దాని మీదే ఈ మిషన్ రంగస్థలం సక్సెస్ అవుతుందా లేదా అనేది తేలుతుంది