Begin typing your search above and press return to search.

చిట్టిబాబుని దాటగలవా మహర్షీ ?

By:  Tupaki Desk   |   10 May 2019 6:05 AM GMT
చిట్టిబాబుని దాటగలవా మహర్షీ ?
X
నిన్న భారీ అంచనాల మధ్య మహేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ రిలీజ్ దక్కించుకున్న మహర్షి వసూళ్ల పర్వం మొదలుపెట్టింది. ఫస్ట్ డే ఫిగర్స్ గురించి ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది కాబట్టి ట్రేడ్ ఇంకా వాటిని బయటపెట్టడం లేదు. మహేష్ 25వ సినిమాగా అభిమానులు దీన్ని చాలా ఎమోషనల్ గా తీసుకున్నారు. ల్యాండ్ మార్క్ మూవీ కాబట్టి రికార్డులు పడగొడితే ఓ గొప్ప జ్ఞాపకంగా మిగిలిపోతుందని వాళ్ళ ఆకాంక్ష.

నాన్ బాహుబలి రికార్డులన్నీ రంగస్థలం పేరు మీదే ఉండటంతో దాన్ని టార్గెట్ గా పెట్టుకుని బరిలోకి దిగాడు మహర్షి. కానీ రంగస్థలం ఫ్లాష్ బ్యాక్ కు వెళ్తే దానికి యునానిమస్ గా అల్టిమేట్ అనే టాక్ వచ్చింది. షో షోకు పెరిగిపోతున్న వసూళ్ల ప్రభంజనంతో దాదాపు అన్ని సెంటర్స్ లో బెస్ట్ కలెక్షన్స్ నమోదు చేసింది. మెగా ఫాన్స్ సైతం ఊహించని రేంజ్ లో తన స్థానాన్ని టాప్ 2 లోకి తీసుకెళ్లింది

ఇప్పుడు మహర్షి విషయంలో అలాంటి పరిస్థితులు కనిపించడం లేదు. మరీ తీసికట్టుగా ఉందని ఎవరు చెప్పనప్పటికీ ఒక్కసారి చూడాల్సిన బాపతులోకే వేస్తున్నప్పటికీ రంగస్థలం చిట్టిబాబుని దాటడం అనుమానంగానే ఉంది. పైగా రంగస్థలం సాధించిన నూట పాతిక కోట్ల షేర్ ని తెచ్చుకోవడం అంతే ఈజీ కాదు.

టికెట్ రేట్లు ఎంత పెరిగినా అదనపు షోలు వేసుకున్నా వీకెండ్ అయ్యాక మహర్షి చూపించే రేంజ్ ని బట్టే ఫైనల్ గా ఇది ఎక్కడ నిలుస్తుందో చెప్పొచ్చు. మహేష్ ఇమేజ్ ఇక్కడ కీలకంగా మారి సబ్జెక్టులో ఎన్ని హెచ్చు తగ్గులున్నా అవన్నీ కవర్ చేసి ప్రేక్షకులను థియేటర్ దాకా లాక్కుని వస్తోంది. వచ్చే బుధవారంకు ఓ అవగాహనకు రావొచ్చు