Begin typing your search above and press return to search.
మలైకా న్యూఇయర్ లో గుడ్ న్యూస్ చెబుతుందా?
By: Tupaki Desk | 31 Dec 2022 12:30 AM GMTసల్మాన్ ఖాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్ తో విడిపోయిన బాలీవుడ్ హాటీ మలైకా అరోరా గత కొంత కాలంగా యంగ్ హీరో అర్జున్ కపూర్ తో డేటింగ్ లో వున్న విషయం తెలిసిందే. ముంబై వీధుల్లో చెట్టపట్టాలేసుకుని తిరుగుతూ మీడియా కంటికి అడ్డంగా బుక్కవుతూ నిత్యం ఈ జంట వార్తల్లో నిలుస్తోంది. గత కొన్నేళ్లుగా డేటింగ్ లో వుంటున్న ఈ జంట త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ ప్రతీ సారి ఓ వార్త నెట్టింట హల్ చల్ చేయడం.. ఈ జంట ఆ వార్తలని ఖండించడం తెలిసిందే. అయితే తాజాగా తమ పెళ్లి వార్తలపై మలైకా అరోరా హింట్ ఇచ్చేసింది.
డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కోసం మలైకా అరోరా 'మూవీంగ్ విత్ మలైకా' పేరుతో ఓ షోని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ షో స్ట్రీమింగ్ కూడా మొదలైంది. ఈ షోలో మైలకా అరోరా వ్యక్తిగత విషయాలతో పాటు కెరీర్ పరమైన కీలక విషయాల్ని వెల్లడించింది. అంతే కాకుండా తన మ్యారేజ్ పై కూడా కీలక అప్ డేట్ ఇచ్చేసినట్టుగా తెలుస్తోంది. సోదరి అమృతా అరోరాతో జరిపిన సరదా సంభాషణలో మలైకా అరోరా ఫన్నీగా స్పందించింది.
గోవా కేఫ్ లో సరదాగా ఒకరిపై ఒకరు ఈ ఇద్దరు సిస్టర్స్ చలోక్తులు విసురుకున్నారు. తన తల్లి జోయిస్ అరోరా తనకు తమ ఫ్యామిలీ బ్యాంగిల్స్ ని కానుకగా ఇచ్చిందని తెలిపింది. దీనిపై ఫన్నీగా స్పందించిన మలైకా తను మా అమ్మకు ముద్దుల కూతురని చెప్పుకొచ్చింది. ఆ మాటలకు స్పందించిన అమృతా అరోరా ఆ బ్యాంగిల్స్ నీకూ కావాలా?.. కావాలంటే ఇచ్చేస్తానని తెలిపింది. అయితే అవి తన దగ్గరే ఉంచేసుకోమని, నువ్వు మమ్మీకి ఫేవరేట్ 'అమ్ము'వి కదా అంటూ మలైకా తెలిపింది.
ఇదే సందర్భంగా మలైకా అరోరా తన మ్యారేజ్ ప్లాన్ గురించి బయటపెట్టేసింది. మా ఇద్దరిలో మళ్లీ పెళ్లి చేసుకునే అవకాశం వున్న వాళ్లలో మొదటి వ్యక్తి ని నేనే అని క్లారిటీ ఇచ్చింది. కాబట్టి అమ్మ పంపంచిన బ్యాంగిల్స్ ని పొందే అవకాశం, అర్హత తనకే ఎక్కువగా వున్నాయని తెలిపి తన పెళ్లిపై వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చేసింది.
దీంతో బాలీవుడ్ వర్గాలు మలైకా, అర్జున్ కపూర్ వచ్చే ఏడాది పెళ్లి చేసుకునే అవకాశం వుందని, ఆ కారణంగానే మలైకా అరోరా హింట్ ఇచ్చేసిందని కామెంట్ లు చేస్తున్నారట. మరి మలైకా నిజంగానే న్యూ ఇయర్ వెడ్డింగ్ న్యూస్ తో సర్ ప్రైజ్ చేస్తుందో వేచి చూడాల్సిందే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.