Begin typing your search above and press return to search.
మెగాహీరో బ్లాక్ బస్టర్ సీక్వెల్ చేయనున్నాడా..??
By: Tupaki Desk | 23 April 2021 11:30 AM GMTటాలీవుడ్ మెగాపవర్ స్టార్ రాంచరణ్ తేజ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమా ఆర్ఆర్ఆర్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ టైం రాంచరణ్ ఓ ఫ్రీడమ్ ఫైటర్ పాత్రలో నటిస్తున్నాడు. అలాగే ఆర్ఆర్ఆర్ సినిమాతోనే రాంచరణ్ పాన్ ఇండియా హీరోగా పరిచయం కాబోతున్నాడు. రాజమౌళితో ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రాంచరణ్ క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో మరో పాన్ ఇండియా సినిమా చేయనున్నాడు. ఇప్పటికే వీరి కాంబినేషన్ పై అధికారిక ప్రకటన వచ్చేసింది. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది.
డైరెక్టర్ శంకర్ తో సినిమా రాంచరణ్ కెరీర్లో 15వది. అయితే ఆ సినిమా మొదలు కాకముందే రాంచరణ్ 16వ సినిమా గురించి సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. ఆ సినిమా కూడా రాంచరణ్ నటించిన బ్లాక్ బస్టర్ రంగస్థలం సినిమాకు సీక్వెల్ అని తెలుస్తుంది. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రాంచరణ్ మరో సినిమా ప్లాన్ జరుగుతుందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. ప్రస్తుతం సుకుమార్ అల్లు అర్జున్ తో పుష్ప అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత రౌడీహీరో విజయ్ దేవరకొండతో ఓ సినిమా చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించాడు. అయితే ఈ రెండు సినిమాల తర్వాత సుక్కు - రాంచరణ్ కాంబో మూవీ పట్టాలెక్కుతుందని టాక్. దీని పై క్లారిటీ వస్తుందేమో చూడాలి.