Begin typing your search above and press return to search.
మాజీని తాజాతో ఉడికిస్తున్న హీరో
By: Tupaki Desk | 7 July 2017 3:57 PM GMTబాలీవుడ్ యంగ్ హీరో రణబీర్ కపూర్ సినిమాలతో ఎంతగా సెన్సేషన్స్ సృష్టిస్తాడో.. వ్యక్తిగత జీవితంలో కూడా అంతకు మించి వివాదాలను సృష్టించేస్తూ ఉంటాడు. ముఖ్యంగా స్టార్ హీరోయిన్స్ తో ఈ కుర్రాడు చేసే రొమాన్స్.. ఎఫైర్స్ ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ గానే ఉంటాయి. మొదట్లో దీపికా పదుకొనేతో రణబీర్ ప్రేమాయణం జరిపాడు.
ఆ తర్వాత రణబీర్ ప్రియురాలి ప్లేస్ లోకి కత్రినా కైఫ్ వచ్చి చేరింది. ఇక పెళ్లే ఆలస్యం అనుకున్న తరుణంలో ఆ అఫైర్ కు కూడా ముగింపు పలికేశాడు. ఇప్పుడు రణబీర్ కపూర్ కొత్త భామను వెతుక్కున్నాడట. ముంబైకి చెందిన ఈ బ్యూటీతో తెగ చక్కర్లు కొట్టేస్తున్నాడు కూడా. అంతే కాదు.. తన మాజీ లవర్ కత్రినాతో కలిసి నటించిన లేటెస్ట్ మూవీ జగ్గా జాసూస్ ప్రమోషన్స్ కు కూడా ఈమెను ఓసారి తీసుకొచ్చేయడం విశేషం. అలాగని ఈ భామకు సినిమాలతో సంబంధం లేదు.. అలాగని చేసే ఉద్దేశ్యం కూడా లేదు.
ఈ కొత్త లవర్ ను తన పాత ప్రేయసి కత్రినాకు పరిచయం కూడా చేశాడట రణబీర్ కపూర్. అసలు విషయం ఏంటంటే.. ఈ న్యూ లవర్ ను కత్రినాకు ఇంట్రడ్యూస్ చేయడం.. ఆమెతో చాలాసేపు ఫోన్ లో కబుర్లు వంటివన్నీ కత్రినా కైఫ్ కు తెగ ఇబ్బందిగా ఉన్నాయట. ఈ మధ్య కాలంలో తన మాజీ లవర్ సల్మాన్ తో కేట్ క్లోజ్ గా ఉండడంతోనే.. ఆమెను ఇరిటేట్ చేసేందుకు రణబీర్ కావాలనే ఇలా చేస్తున్నాడన్నది బాలీవుడ్ టాక్.