Begin typing your search above and press return to search.
బాలయ్య కోసం నాని పక్కకు జరుగుతాడా..?
By: Tupaki Desk | 29 Oct 2021 8:31 AM GMTకరోనా నేపథ్యంలో వాయిదా పడిన పెద్ద సినిమాలన్నీ విడుదల తేదీలను లాక్ చేసుకుంటున్నాయి. నందమూరి బాలకృష్ణ - దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందుతున్న 'అఖండ' మూవీ రిలీజ్ డేట్ ని మాత్రం ఇంకా ప్రకటించలేదు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటోంది.
ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలకృష్ణ ఇందులో ద్విపాత్రాభినయం పోషిస్తున్నారు. 'సింహా' 'లెజెంట్' వంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత బాలయ్య - బోయపాటి కాంబోలో వస్తున్న ''అఖండ'' సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. నందమూరి అభిమానులు ఈ మూవీ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
ఈ నేపథ్యంలో బాలకృష్ణ 'అఖండ' చిత్రాన్ని డిసెంబర్ లో విడుదల చేయాలనే ఆలోచన చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. డిసెంబర్ 17న 'పుష్ప' - సీజన్ లో 'ఆర్.ఆర్.ఆర్' తో పాటుగా మరో రెండు పెద్ద సినిమాల విడుదల ఉండటంతో బాలయ్య చిత్రాన్ని డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారట.
అయితే క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న నేచురల్ స్టార్ నాని నటించిన ''శ్యామ్ సింగ రాయ్'' సినిమాని విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇది వరకే ప్రకటించారు. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వెంకట్ బోయనపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకొని శరవేగంగా నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది.
అయితే ఇప్పుడు బాలకృష్ణ అదే తేదీకి రావాలని చూస్తే మాత్రం.. నాని సినిమాని జనవరి నెలాఖరుకు లేదా మార్చి నెలలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. బాలయ్య ఫ్యాన్ గా నటించిన నాని.. ఆయన సినిమాతో బాక్సాఫీస్ వద్ద పోటీపడే ఆలోచన చేస్తారని అనుకోలేం. ప్రస్తుతానికి అయితే 'శ్యామ్ సింగ రాయ్' కూడా ప్రమోషన్స్ మొదలు పెట్టలేదు. 'అఖండ' సినిమా గురించి క్లారిటీ వస్తే ప్రచారం ముమ్మరం చేయాలని చూస్తున్నారట.
ఏదేమైనా ఈసారి ఎట్టిపరిస్థితుల్లోనూ థియేట్రికల్ రిలీజ్ కే వెళ్లాలని నాని ఫిక్స్ అయి ఉన్నారు. అందుకే క్రిస్మస్ కు వస్తున్నట్లు కాన్ఫిడెంట్ గా చెప్పారు. కాకపోతే ఇప్పుడు బాలకృష్ణ సినిమా నాని కి పోటీగా మారే పరిస్థితులు వచ్చాయని అంటున్నారు. 'అఖండ' 'శ్యామ్ సింగ రాయ్' రెండూ ఇద్దరు హీరోల కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో రూపొందుతున్న సినిమాలు. మరి బాలయ్య కోసం నాని పక్కకు జరుగుతారా? అఖండ మరో రిలీజ్ డేట్ చూసుకుంటారా? అనేది తెలియాలంటే ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే.