Begin typing your search above and press return to search.

క‌వ‌ల‌ల మ‌మ్మీ న‌య‌న్ సెట్స్ కి వ‌స్తుందా రాదా?

By:  Tupaki Desk   |   13 Oct 2022 5:34 AM GMT
క‌వ‌ల‌ల మ‌మ్మీ న‌య‌న్ సెట్స్ కి వ‌స్తుందా రాదా?
X
సౌత్ వ‌ర్సెస్ నార్త్ డిబేట్ అంత‌కంత‌కు వేడెక్కిస్తోంది. నార్త్ లో సౌత్ సినిమా హ‌వాని ఇప్ప‌టికీ అక్క‌డ స్టార్లు ఫిలింమేక‌ర్స్ డైజెస్ట్ చేసుకోలేక‌పోతున్నారు. పోటీత‌త్వంతో చాలామంది ప్ర‌య‌త్నించినా బాక్సాఫీస్ వ‌ద్ద బోర్లా ప‌డుతున్నారు. దీంతో ఈ క‌సి ఒక్కోసారి అస‌హ‌నంగా కోపంగాను మారుతోంది. అంతేకాదు ఇటీవ‌లి కాలంలో సౌత్ ట్యాలెంట్ ని హైర్ చేసుకుని మ‌రీ బాలీవుడ్ స్టార్లు ప్ర‌యోగాలు చేస్తున్నారు.

ఇదే కేట‌గిరీకి చెందుతుంది షారూక్ జ‌వాన్. త‌మిళ స్టార్ డైరెక్ట‌ర్ అట్లీ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌డంతో విజ‌యంపై అత‌డిలో ధీమా పెరిగింది. జీరో లాంటి డిజాస్ట‌ర్ త‌ర్వాత అట్లీ ఇప్పుడు షారూక్ ని గండం నుంచి గ‌ట్టెక్కించాల్సి ఉంటుంది. ఇప్ప‌టికే జ‌వాన్ ఫ‌స్ట్ లుక్ మోష‌న్ టీజ‌ర్ల‌కు చ‌క్క‌ని స్పంద‌న వ‌చ్చింది. కింగ్ ఖాన్ ని పూర్తి మాసీ లుక్ తో ప్రెజెంట్ చేస్తూ అన్ని క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌తో తెర‌పై అద్భుతంగా ఆవిష్క‌రించ‌నున్నాడ‌ని భ‌రోసా అందింది.

ఈ మూవీని నార్త్ - సౌత్ రెండు చోట్లా తెర‌కెక్కించారు. పూణే- ముంబై- హైదరాబాద్ - చెన్నై ల‌లో తెర‌కెక్కింది. జవాన్ చిత్రీక‌ర‌ణ‌ చివరి దశకు చేరుకుంటోంది. త్వరలోనే చివరి షెడ్యూల్ షూటింగ్ ను ప్రారంభించనున్నారు. తాజా స‌మాచారం ప్రకారం.. త్వరలో రాజస్థాన్ లో జవాన్ కీలక షెడ్యూల్ చిత్రీకరించనున్నారు.

20 రోజుల షెడ్యూల్ లో షారుఖ్ ఖాన్ పై కీల‌క స‌న్నివేశాల్ని తెర‌కెక్కిస్తారు. సజావుగా షెడ్యూల్ ని పూర్తి చేసేందుకు టీమ్ సన్నద్ధమైంది. ఇప్పటికే ప‌నులు జ‌రుగుతున్నాయి. అత్యున్నత స్థాయి భద్రతను ఏర్పాటు చేసారు. అయితే నయనతార కవలలతో ఆశీర్వదించబడినందున నవజాత శిశువులతో సమయం గడపాలని కోరుకుంటుంది కాబట్టి మేకర్స్ ఇంకా తగిన తేదీని కనుగొనాల్సి ఉంది.

చెన్నై షెడ్యూల్ లో నయనతార మెజారిటీ పార్ట్ షూట్ ని పూర్తి చేసి ఉండవచ్చని భావిస్తున్నారు. అయితే ఆమె వ్యక్తిగత కారణాల వల్ల టీమ్ కి దూరంగా ఉన్నందున SRK తో కీలకమైన సన్నివేశాలను రాజస్థాన్ లో చిత్రీకరించే ప్లాన్ చేశార‌ని కూడా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఈ షెడ్యూల్ లో న‌య‌న్ చేరుతుందా లేదా? అన్న‌దానిపైనా స్ప‌ష్ఠ‌త రావాల్సి ఉంది.

SRK ఇటీవల ట్విట్టర్ లో జవాన్ బృందంతో తన గత 30 రోజుల షూట్ కి సంబంధించిన ఫోటోల‌ను షేర్ చేసాడు. సూపర్ స్టార్ రజనీకాంత్- ద‌ళ‌ప‌తి విజయ్ ఖాన్ ని సెట్లో కలిశారు. షారుఖ్ ఖాన్ సహనటుడు విజయ్ సేతుపతితో కూడా చాలా సేపు చర్చలు జరిపాడు. జవాన్ దర్శకుడు అట్లీ అతని భార్య ప్రియా ఆతిథ్యానికి ధన్యవాదాలు తెలిపారు. 30 రోజుల బ్లాస్ట్ RCE టీమ్! తలైవర్ (ర‌జ‌నీ) మా సెట్ కి వ‌చ్చి ఆశీర్వదించారు… @విజ‌య్ సేతుప‌తిOffl & ద‌ళ‌ప‌తి విజ‌య్ @అనిరుధ్ ల‌తో లోతైన చర్చలతో కొన‌సాగాం. నయనతారతో కలిసి సినిమా చూశారు.... మీ ఆతిథ్యానికి థాంక్యూ..@అట్లీ & ప్రియ ఇప్పుడు చికెన్ 65 రెసిపీని నేర్చుకోవాలి! అని త‌న‌దైన శైలిలో కింగ్ ఖాన్ ప్ర‌తి ఒక్క‌రికీ ధ‌న్య‌వాదాలు తెలిపారు.

జవాన్ లో ప్రియమణి- సన్యా మల్హోత్రా- సునీల్ గ్రోవర్ - యోగి బాబు కూడా నటించారు. భారీ స్థాయిలో తెరకెక్కిన జవాన్ జూన్ 2023లో థియేటర్లలో విడుదల కానుంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.