Begin typing your search above and press return to search.
న్యూ పాన్ ఇండియా స్టార్ గా అవతరిస్తాడా..?
By: Tupaki Desk | 5 Feb 2022 12:30 AM GMT'అర్జున్ రెడ్డి' చిత్రంతో సెన్సేషన్ క్రియేట్ చేసిన విజయ్ దేవరకొండ.. 'గీత గోవిందం' చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకొని అమాంతం క్రేజ్ పెంచుకున్నారు. అయితే ఆ తర్వాత వచ్చిన 'వరల్డ్ ఫేమస్ లవర్' మూవీ డిజాస్టర్ అయింది. అయినప్పటికీ ఈ మూవీ డబ్బింగ్ వెర్సన్ నార్త్ లో విశేష స్పందన తెచ్చుకుంది. వీడీ బిగ్ స్క్రీన్ మీద కనిపించి చాలా కాలం అయింది. గత రెండేళ్లుగా 'లైగర్' సినిమాకే పరిమితం అయ్యారు.
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ''లైగర్'' చిత్రాన్ని తెలుగు - హిందీలలో ఏకకాలంలో నిర్మించి తమిళ కన్నడ మలయాళ భాషల్లో డబ్బింగ్ చేసి రిలీజ్ చేయనున్నారు. ఇది విజయ్ దేవరకొండ - పూరీ లకు ఫస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్. అందుకే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కరణ్ జోహార్ వంటి బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కూడా వీరికి సపోర్ట్ గా ఉన్నారు.
మిక్డ్స్ మార్షల్ ఆర్ట్స్ కథాంశంతో తెరకెక్కుతున్న 'లైగర్' సినిమాలో విజయ్ దేవరకొండ ప్రొఫెషనల్ బాక్సర్ గా కనిపించనున్నారు. ఇందులో బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కీలక పాత్ర పోషించారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ - టీజర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. మెజారిటీ భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని 'అర్జున్ రెడ్డి' రిలీజ్ డేట్ ఆగస్ట్ 25న విడుదల చేయనున్నారు.
'లైగర్' సినిమాపై భారీ హైప్ ఉంది. పూరీ - విజయ్ కూడా ఈ ప్రాజెక్ట్ పై ధీమాగా ఉన్నారు. అంచనాలు అందుకోవడంలో ఫెయిల్ అయినా వీరిద్దరూ మళ్ళీ కలిసి మరో సినిమా చేయాలని డిసైడ్ అయ్యారని తెలుస్తోంది. అంతేకాదు VD ఇప్పటికే మరో పాన్ ఇండియా చిత్రాన్ని లైన్ లో పెట్టారు. 'పుష్ప' సినిమాతో బాలీవుడ్ లో సత్తా చాటిన డైరెక్టర్ సుకుమార్ తో తన తదుపరి మూవీ చేయనున్నారు.
సుక్కూ - వీడీ ప్రాజెక్ట్ ను ఫాల్కన్ క్రియేషన్స్ బ్యానర్ పై కేదార్ సెలగం శెట్టి నిర్మించనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చింది. 'పుష్ప 2' పూర్తైన తర్వాత వీరి కాంబినేషన్ సెట్స్ మీదకు వెళ్తుంది. ఒకవేళ 'లైగర్' ప్లాప్ అయినా వెంటనే సుకుమార్ సినిమా ఉంది కనుక.. అందరి దృష్టిని ఆకర్షించగలడు. దీనిని బట్టి విజయ్ కెరీర్ సేఫ్ జోన్ లో ఉన్నట్లే.
అదే 'లైగర్' మూవీ బ్లాక్ బస్టర్ అయితే మాత్రం విజయ్ దేవరకొండ మరో పాన్ ఇండియా స్టార్ గా అవతరించే అవకాశం ఉంది. ఈ క్రమంలో వచ్చే సుక్కూ ప్రాజెక్ట్ తో నెక్స్ట్ లెవల్ కి వెళ్లొచ్చు. ఎలా చూసినా VD స్టార్ డమ్ కి ఇబ్బంది లేదనుకోవాలి. మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి.