Begin typing your search above and press return to search.
NGK సూర్యను కాపాడుతుందా?
By: Tupaki Desk | 29 April 2019 8:47 AM GMTతమిళ స్టార్ హీరో సూర్యకు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఫాలోయింగ్ గురించి తెలిసిందే. `గజిని` సినిమాతో వీరాభిమానుల్ని సంపాదించుకున్నాడు. ఆ తర్వాత అతడు నటించిన ఎన్నో సినిమాలు టాలీవుడ్ లో భారీగా మార్కెట్ ని దక్కించుకున్నాయి. సింగం సిరీస్ తో మాస్ లో గొప్ప ఫాలోయింగ్ ని పెంచుకున్న హీరోగా సూర్య అంటే ఇక్కడ ఎప్పుడూ భారీ అంచనాలే ఉంటాయి. అయితే కొన్ని వరుస తప్పిదాలు అతడి మార్కెట్ ని పూర్తిగా దించేయడం అభిమానులకు బాధ కలిగించిందనేది వాస్తవం. ప్రస్తుతం సూర్య తిరిగి కంబ్యాక్ అవుతాడా? అతడిని ఎన్‌జీకే ఆదుకుంటుందా? అంటూ ఆసక్తికర చర్చ సాగుతోంది. ఓవైపు మార్కెట్ వర్గాల్లో మరోవైపు అభిమానుల్లో దీనిపైనే ఆసక్తికర డిబేట్ సాగుతోంది.
కథల ఎంపికల పరంగా అనాలో లేక తెలిసి చేసిన తప్పిదాలు అనాలో సూర్య మార్కెట్ డౌన్ ఫాల్ అయ్యిందన్నది ట్రేడ్ లో వినిపిస్తున్న టాక్. అతడి రేంజుకు తగ్గ ఒక్క బ్లాక్ బస్టర్ కూడా ఇటీవల లేనేలేదు. దీంతో ఎన్ జీకేతో అతడు తిరిగి తెలుగు మార్కెట్లో తన స్టామినాని నిరూపించుకుంటాడా? .. ఇప్పటివరకూ అయితే ఎన్ జీకేపై చెప్పుకోదగ్గ బజ్ అయితే లేదు. అంచనాలు అంతంత మాత్రమే.
ఈ సినిమా పోస్టర్లు అభిమానుల్ని ఆకట్టుకున్నాయి. ఎన్ జీకే ఓ పొలిటికల్ డ్రామా... సూర్య ఈ చిత్రంలో ఓ విప్లవకారుడిగా నటిస్తున్నాడని.. నందగోపాల కృష్ణగా అలరిస్తాడని మాత్రం అనుకున్నారు. అయితే అన్నిటికీ ఒకే ఒక్క సమాధానం ట్రైలర్. NGK ట్రైలర్ మాత్రమే మార్కెట్ వర్గాల్లో అంచనాల్ని పెంచగలదు. నేడు ట్రైలర్- ఆడియో రిలీజ్ అంటూ ఇప్పటికే పోస్టర్ ని రిలీజ్ చేశారు. నేడు ఈ సినిమా ట్రైలర్ రిలీజవుతోంది. యువన్ శంకర్ రాజా లాంటి ట్యాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అందించిన ఆల్బమ్ రిలీజవుతోంది. దీంతో కొంతమేర ఆడియోపైనా అంచనాలు ఉన్నాయి. చాలా పరాజయాల తర్వాత సెల్వరాఘవన్ సైతం కంబ్యాక్ కావాల్సిన సన్నివేశంలో ఈ చిత్రాన్ని ఎలా మలిచాడు? అన్నది నేటి ట్రైలర్ చూసి ఓ అంచనాకు రావొచ్చు. మే 31న ఎన్ జీకే రిలీజ్ అంటూ ప్రకటించారు కాబట్టి ఈ ట్రైలర్ కోసం మార్కెట్ వర్గాలు అంతే ఉత్కంఠగా వేచి చూస్తున్నాయి. సూర్య ఈజ్ బ్యాక్ ఎగైన్! అని ఫ్యాన్స్ సంబరాలు చేసుకోవాలంటే ట్రైలర్ తో మెప్పిస్తారో లేదో చూడాలి. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్.ఆర్. ప్రకాష్ బాబు- ఎస్.ఆర్.ప్రభు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.