Begin typing your search above and press return to search.

2023లోనైనా నిధి అగ‌ర్వాల్ ఆ సెంటిమెంట్ ని బ్రేక్ చేయాలి!

By:  Tupaki Desk   |   31 Dec 2022 6:44 AM GMT
2023లోనైనా నిధి అగ‌ర్వాల్ ఆ సెంటిమెంట్ ని బ్రేక్ చేయాలి!
X
'స‌వ్య‌సాచి' చిత్రంతో ఉవ్వెత్తున దూసుకొచ్చింది నిధి అగ‌ర్వాల్. అందం..అభిన‌యంతో ఆక‌ట్టుకుంది. కానీ ఆ సినిమా ఫ‌లితం మ‌రోలా క‌నిపించింది. అటుపై రిలీజ్ అయిన 'మిస్ట‌ర్ మ‌జ్ను' కూడా మ‌రోసారి అమ్మడి అదృష్టాన్ని ప‌రీక్షించింది. ఈ రెండు వైఫ‌ల్యాల అనంతరం 'ఇస్మార్ట్ శంక‌ర్' తో తొలి హిట్ ఖాతాలో వేసుకుంది. కానీ ఆ స‌క్సెస్ ఇక్క‌డ అంత బిజీ న‌టిని చేయ‌లేదు.

అదే స‌మ‌యంలో కోలీవుడ్ లో ఛాన్సులు రావ‌డంతో అక్క‌డో రెండు సినిమాలు చేసింది. ఆ త‌ర్వాత 'హీరో' రూపంలో మ‌రో ప‌రాజ‌యం ప‌ల‌క‌రించింది. అలా నిధి కెరీర్ లో ఈ ఐదేళ్ల‌లో సాధించింది ఏదైనా ఉంది? అంటే అది పూరి సినిమాగానే చెప్పాలి.

త‌ప్ప మ‌రో ర‌కంగా నిధి ఇక్క‌డ వెల‌గ‌బెట్టింది లేదు. మ‌రిప్పుడు నిధి భ‌విత‌వ్యం ఏంటి? అంటే చేతిలో ఉన్న సినిమాతో సక్సెస్ అందుకుని రేసులోకి వ‌స్తే త‌ప్ప‌! న‌టిగా బిజీ అవ్వ‌డం క‌ష్ట‌మ‌ని తెలుస్తోంది.

ప్ర‌స్తుతం అమ్మ‌డు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న 'హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు'లో న‌టిస్తోంది. భారీ స‌క్సెస్ లు లేక‌పోయినా...నిధిలో కొన్ని క్వాలిటీలు చూసి క్రిష్ అవ‌కాశం క‌ల్పించాడు. ఇప్పుడా ఛాన్స్ ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని అమ్మ‌డు సీరియ‌స్ గానే క‌నిపిస్తుంది. వ‌చ్చే ఏడాది రిలీజ్ కానున్న‌ సినిమాతో స‌క్సెస్ అందుకుంటే న‌టిగా బిజీ అయ్యే అవ‌కాశం ఉంది.

లేదంటే కెరీర్ చ‌ర‌మాంకానికి చేరిన‌ట్లేన‌ని విమర్శ‌లు వినిపిస్తున్నాయి. చేతిలో ఈ ఒక్క ఛాన్స్ త‌ప్ప మ‌రో కొత్త సినిమా లేదు. అయితే ఇక్క‌డే ఓ బ్యాడ్ సెంటిమెంట్ కూడా వెంటాడుతుంది. ప‌వ‌న్ తో ప‌నిచేసిన హీరోయిన్లు స‌క్సెస్ అయింది చాలా త‌క్కువ మందే ఉన్నారు. సినిమాలు హిట్ అయినా వాటిలోన‌టించిన హీరోయిన్లు మాత్రం అంత ఫేమ‌స్ కాలేదు.

ఒక‌వేళ అలా స‌క్సెస్ అయిన భామ‌ల జాబితా చెక్ చేసినా వాళ్లు అంత‌కుముందే ఫేమ‌స్ బ్యూటీలు. ఆ ర‌క‌మైన సెంటిమెట్ ని నిధి అగ‌ర్వాల్ 2023 లోనైనా నిధి బ్రేక్ చేయ‌గ‌ల‌గాలి. ఇది జ‌ర‌గాల‌ని పీకే అభిమానులు స‌హా ..నిధి ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.