Begin typing your search above and press return to search.

ఈ దెబ్బతో ఎన్టీఆర్‌.. అల్లు అర్జున్‌ ఆయన్ని పట్టించుకుంటారా?

By:  Tupaki Desk   |   5 May 2023 1:32 PM GMT
ఈ దెబ్బతో ఎన్టీఆర్‌.. అల్లు అర్జున్‌ ఆయన్ని పట్టించుకుంటారా?
X
సక్సెస్ లో ఉన్న దర్శకుడికి పిలిచి అవకాశాలు ఇవ్వడం... ఒక్క ఫ్లాప్ అయితే ఆ దర్శకుడిని స్కిప్ చేయడం అన్ని సినీ ఇండస్ట్రీలో హీరోలు చేసే పని. ముఖ్యంగా తెలుగు హీరోలు సక్సెస్ ఫుల్‌ దర్శకుల వెంట పరుగులు పెడుతూ ఉంటారు. అందుకే ఒక్క సక్సెస్ వచ్చినా కూడా స్టార్ హీరోతో సినిమా చేసే అవకాశాలను దక్కించుకున్న దర్శకులు ఉన్నారు.

వరుసగా రెండు ఫ్లాప్స్ పడితే కనీసం ఆ దర్శకుడిని చూసేందుకు కూడా ఇష్టపడని హీరోలు మన తెలుగు సినిమా పరిశ్రమలో ఉన్నారు అనేది టాక్‌. ఆ విషయాన్ని పక్కన పెడితే ప్రస్తుతం సురేందర్ రెడ్డి భవిష్యత్తు ఏంటి.. ఆయన కెరీర్ ఏంటి అంటూ అంతా ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.

ఇటీవల ఆయన తెరకెక్కించిన ఏజెంట్‌ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుని ఉంటే వచ్చే ఏడాదిలో అల్లు అర్జున్‌ హీరోగా ఒక సినిమా చేసే అవకాశం దక్కేది.

కానీ ఏజెంట్‌ ఫ్లాప్ అవ్వడంతో అల్లు అర్జున్‌ నుండి సురేందర్‌ రెడ్డికి పిలుపు వస్తుందా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

కేవలం అల్లు అర్జున్ మాత్రమే కాకుండా గతంలో వర్క్ చేసిన అభిమానంతో ఎన్టీఆర్‌ కూడా సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమాను చేసేందుకు ఆసక్తి ని కనబరచడం జరిగింది. కానీ ఏజెంట్‌ మరీ దారుణమైన డిజాస్టర్ గా నిలవడం వల్ల ఎన్టీఆర్‌.

అల్లు అర్జున్ లు మాత్రమే కాకుండా టైర్ 2 హీరోలు కూడా సూరి దర్శకత్వంలో నటించే విషయంలో వెనుకంజ వేస్తున్నారట. ముందు ముందు మళ్లీ ఈ దర్శకుడు సక్సెస్ ను దక్కించుకుని స్టార్‌ హీరోలకు వాంటెడ్‌ అయ్యేనా చూడాలి.