Begin typing your search above and press return to search.

మహానాయకుడు వెనక్కు జరిగిందా?

By:  Tupaki Desk   |   16 Jan 2019 5:05 PM GMT
మహానాయకుడు వెనక్కు జరిగిందా?
X
భారీ అంచనాల నడుమ సంక్రాంతి సీజన్లో విడుదలయిన 'ఎన్టీఆర్ కథానాయకుడు' పాజిటివ్ రివ్యూస్ తెచ్చుకుంది గానీ కమర్షియల్ గా మాత్రం డిజాస్టర్ అయింది. దాదాపు రూ.70 కోట్లకు థియేట్రికల్ రైట్స్ బిజినెస్ జరిగితే ఫుల్ రన్ లో రూ.20 కోట్లు కూడా రికవరీ చేసేలా లేదు. ఇలాంటి రెస్పాన్స్ ను ఏమాత్రం ఊహించని ఎన్టీఆర్ టీమ్ తీవ్రంగా అప్సెట్ అయ్యారట. ఈ ఇంపాక్ట్ ఎన్టీఆర్ బయోపిక్ రెండో భాగం మీద పడిందని వార్తలు వస్తున్నాయి.

రెండో భాగానికి సంబంధించి కొంత పోర్షన్ షూటింగ్ మాత్రమే పెండింగ్ ఉంది. ముందు అనుకున్న ప్రకారం అయితే 'ఎన్టీఆర్ మహానాయకుడు' ఫిబ్రవరి 7 న విడుదల కావాల్సి ఉంది. కానీ మొదటిభాగం ఫలితంతో నిరాశపడిన క్రిష్ - బాలకృష్ణ ఇద్దరూ రెండో భాగం విడుదలను కొద్దిరోజులు వాయిదా వేయాలని డిసైడ్ అయ్యారనే టాక్ వినిపిస్తోంది. మొదటి భాగంలా కాకుండా ఏవిధంగా 'మహానాయకుడు' ను హిట్ గా తీర్చిదిద్ధాలి అనేదానికిపై వారు తీవ్రంగా చర్చిస్తున్నారట.

నిజానికి మొదటి భాగం కంటే రెండో భాగం విషయంలోనే ప్రేక్షకుల్లో వ్యతిరేకత వ్యక్తం అయ్యే అవకాశం ఉంది. నిజాలను చూపించకుండా దాచిపెడుతున్నారని షుగర్ కోట్ వేసి చూపిస్తారనే అనుమానాలు అందరికీ ఉన్నాయి. మరోవైపు 'అసలు నిజాలు చూపిస్తాను. పెద్దాయన ఆశిస్సులు మా సినిమాకే ఉన్నాయి' అని బెదిరిస్తున్న రామ్ గోపాల్ వర్మ ఒకవైపు టెన్షన్ పెడుతుంటే.. మరోవైపు నాదెండ్ల భాస్కర రావు ఇంటర్వ్యూలు కూడా సోషల్ మీడియాలో పాపులర్ అవుతూ ఉండడం ఎన్టీఆర్ టీమ్ కు తలనొప్పిగా మారింది. మరి వీటన్నిటినీ ఎదుర్కొని 'మహానాయకుడు' ప్రేక్షకులను ఏవిధంగా మెప్పిస్తాడో వేచి చూడాలి.