Begin typing your search above and press return to search.

ఈ ట్రెండ్ లో ఉత్త‌రాదిన దూసుకెళ‌తారా?

By:  Tupaki Desk   |   26 Aug 2022 5:10 AM GMT
ఈ ట్రెండ్ లో ఉత్త‌రాదిన దూసుకెళ‌తారా?
X
ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా పాన్ ఇండియా సినిమాలు పాన్ ఇండియా స్టార్ల గురించి చ‌ర్చ సాగుతోంది. బాలీవుడ్ స్టార్ హీరోలు ఖాన్ లు బ‌చ్చ‌న్ లు క‌పూర్ లు రోష‌న్ లు ఏల్తున్న చోట టాలీవుడ్ స్టార్లు దూకుడు ప్ర‌ద‌ర్శించ‌డం ఆస‌క్తిగా మారింది. తెలుగు నుంచి చిన్న హీరోల సినిమాలు కూడా ఉత్త‌రాదిన బంప‌ర్ హిట్లు కొట్టేస్తుండ‌డం చూస్తుంటే ట్రెండ్ ఎంత వేగంగా మారిందో అర్థ‌మ‌వుతోంది. మంచి కంటెంట్ ఉన్న సౌత్ సినిమాల‌కు ఉత్త‌రాది ఆడియెన్ బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతుండ‌డం దానికి త‌గ్గ‌ట్టే మ‌న హీరోలు కూడా అటువైపు దృష్టి సారించ‌డం తో అంతా ఉత్కంఠ‌గా మారింది.

ఈ ఏడాది ఆర్.ఆర్.ఆర్- కేజీఎఫ్ 2- పుష్ప చిత్రాలు ఉత్త‌రాదిన బంప‌ర్ హిట్లు కొట్ట‌గా.. ఇటీవ‌లే అడివిశేష్ మేజ‌ర్.. నిఖిల్ - కార్తికేయ 2 కూడా హిందీ బెల్ట్ లో సంచ‌ల‌న విజ‌యాల్ని న‌మోదు చేసి కొత్త ఆశ‌ల్ని రేకెత్తించాయి. విజయ్ దేవ‌ర‌కొండ లైగ‌ర్ మిశ్ర‌మ స్పంద‌న‌లతో ప్రారంభ‌మైనా అత‌డి న‌ట‌న‌కు మంచి పేరొచ్చింది. ఇక‌పై హీరోల‌తో ప‌ని లేకుండా కంటెంట్ ఉన్న‌ తెలుగు సినిమాల‌ను హిందీ బెల్ట్ లోనూ విడుద‌ల చేస్తే బెట‌ర్ రిజ‌ల్ట్ ద‌క్కేందుకు ఛాన్సుంద‌ని భ‌రోసా ల‌భించింది.

ఇదే అద‌నుగా ఇప్పుడు ఇత‌ర తెలుగు యువ‌హీరోలు కూడా హిందీ మార్కెట్లో స‌త్తా చాటేందుకు ప్ర‌య‌త్నిస్తారా? అంటే అందుకు అవ‌కాశం లేక‌పోలేదని విశ్లేషిస్తున్నారు. తదుప‌రి అఖిల్ న‌టిస్తున్న ఏజెంట్ ని హిందీ మార్కెట్లో పెద్ద రేంజులో విడుద‌ల చేసేందుకు స‌న్నాహ‌కాల్లో ఉన్నారు. ఈ మూవీతో పాన్ ఇండియన్ మార్కెట్లో స‌త్తా చాటాల‌ని అఖిల్ ఉవ్విళ్లూరుతున్నాడు. అలాగే నేచుర‌ల్ స్టార్ నాని... శ‌ర్వానంద్... వ‌రుణ్ తేజ్.. వైష్ణ‌వ్ తేజ్ స‌హా ప‌లువురి చిత్రాల‌ను మునుముందు హిందీ బెల్ట్ లోనూ విడుద‌ల చేసేందుకు ఆస్కారం ఉంద‌ని టాక్ వినిపిస్తోంది.

శేష్.. నిఖిల్ ఒక ట్రెండ్ క్రియేట్ చేసారు. ఇదే అద‌నుగా ఇప్పుడు ఇత‌ర మిడ్ రేంజ్ హీరోలు కూడా అటువైపు ఫోక‌స్ చేయడం స‌రైన ఆలోచ‌నే అని కూడా విశ్లేషిస్తున్నారు. ఇక నాని - శ‌ర్వానంద్ లాంటి హీరోలు చాలా కాలంగా తెలుగు -త‌మిళం ద్విభాషా చిత్రాల కోసం ప్ర‌య‌త్నించారు కానీ హిందీ ఆడియెన్ ని ఎప్పుడూ దృష్టిలో పెట్టుకుని సినిమాలు చేయ‌లేదు.

కానీ ఇక మీద‌ట ఆలోచ‌నా ప‌రిధి విస్త‌రించ‌డం స‌రైన ఆలోచ‌న అని విశ్లేషిస్తున్నారు. ఇక‌పై ఎంపిక చేసుకునే కంటెంట్ కూడా ఉత్త‌రాది సెన్సిబిలిటీస్ ని దృష్టిలో పెట్టుకుని చేయాల‌ని కూడా సూచిస్తున్నారు. మారుతున్న ట్రెండ్ ని ఒడిసిప‌ట్టుకోవ‌డం చాలా ముఖ్యం.

ఆ దిశ‌గా స‌ద‌రు యువ‌ హీరోలూ ఆలోచిస్తున్నార‌నే భావించాలి. టాలీవుడ్ నుంచి అగ్ర హీరోలు భారీ పాన్ ఇండియా చిత్రాల‌తో హిందీ మార్కెట్లో దూసుకెళుతుంటే వారి వెంటే యువ‌హీరోలు కూడా ఎద‌గాల‌ని ఉవ్వెత్తున‌ దూసుకెళ్లాల‌ని 'తుపాకి' ఆకాంక్షిస్తోంది.