Begin typing your search above and press return to search.
వీరమల్లు తో పవన్..ఆ మ్యాజిక్ ని రిపీట్ చేస్తాడా?
By: Tupaki Desk | 11 Oct 2022 3:30 PM GMTమూడున్నరేళ్ల విరామం తరువాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రీమేక్ లతో రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. బాలీవుడ్ హిట్ `పింక్` ఆధారంగా రీమేక్ అయిన `వకీల్ సాబ్`తో మళ్లీ ట్రాక్ లోకి వచ్చేశారు పవర్ స్టార్. ఈ మూవీ తరువాత పవన్ అంగీకరించిన ఫస్ట్ పీరియాడ్ ఫిల్మ్ `హరి హర వీరమల్లు`. క్రిష్ జాగర్లమూడి డైరెక్ట్ చేస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్ ఏ.ఎం. రత్నం సమర్పణలో ఏ. దయాకర్ రావు ఈ మూవీని నిర్మిస్తున్నారు.
ఈ ప్రాజెక్ట్ ప్రారంభం నుంచి ఈ మూవీ కోసం పవన్ అభిమానులతో పాటు సినిమా లవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వరుస రీమేక్ ల తరువాత పవన్ చేస్తున్న ఓరిజినల్ స్క్రీప్ట్ కావడం, పక్కా ప్లానింగ్, పర్ ఫెక్ట్ విజువల్స్ తో అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ కావడంతో ఈ ప్రాజెక్ట్ పై అందరి దృష్టి పడింది. కోవిడ్ కు ముందే భారీ సెట్ ల నిర్మాణం పూర్తి చేసుకుని సెట్స్ పైకి వెళ్లిన ఈ మూవీ కొంత వరకు ఇప్పటికే పూర్తయింది.
అనంతరం యూనిట్ షూటింగ్ కి బ్రేక్ ఇచ్చారు. పవన్ రాజకీయ వ్యవహారాల్లో బిజీ గా వుండటం వల్ల ఈ మూవీ షూటింగ్ కు అనూహ్యంగా గ్యాప్ లు ఏర్పడుతూ వచ్చాయి. తాజాగా ఈ మూవీ నూతన షెడ్యూల్ కి సంబంధించిన కీలక అప్ డేట్ ని అందించిన చిత్ర బృందం తదుపరి షెడ్యూల్ కోసం పక్కా ప్రాణాళికతో వర్క్ షాప్ లు నిర్వహించింది. 17వ శతాబ్దం మొఘల్ సామ్రాజ్య కాలం నాటి పరిస్థితుల నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.
వారికి ఎదురుతిరిగే రెబల్ నాయకుడిగా పవన్ కల్యాణ్ హరి హర వీరమల్లు పాత్రలో కనిపించబోతున్నాడు. ఇటీవల పవన్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన పవర్ గ్లాన్స్ సినిమాపై మరింత హైప్ ని క్రియేట్ చేసింది. చారిత్రక నేపథ్యంలో రూపొందుతున్న ఈ మూవీ బిజినెస్ పరంగా సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయం అని చెబుతున్నారు. దానికి ప్రధాన కారణం రీసెంట్ గా విడుదలై సంచలన విజయం సాధించిన `పొన్నియిన్ సెల్వన్ 1` అని తెలుస్తోంది.
చోళ సామ్రాజ్యం నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్ లోనూ అనూహ్య విజయాన్ని సాధించడమే కాకుండా రికార్డు స్థాయి వసూళ్లని, ఇంత వరకు ఏ తమిళ సినిమా ఊహించని బిజినెస్ ని చేసి ఔరా అనిపించింది.
ఇదే పంథాలో పవన్ నటిస్తున్న పీరియాడిక్ ఫిల్మ్ `హరి హర వీరమల్లు` కూడా మ్యాజిక్ ని రిపీట్ చేస్తుందా అనే చర్చ జరుగుతోంది. అనుకున్నట్టుగా మ్యాజిక్ చేస్తే వచ్చే ఎన్నికల్లో పవన్ కు ఈ మూవీ భారీ సపోర్ట్ గా నిలవడం ఖాయం అని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.