Begin typing your search above and press return to search.
`సాహో` రిలీజయ్యాక డార్లింగ్ పెళ్లి?!
By: Tupaki Desk | 3 Aug 2019 6:28 AM GMT`బాహుబలి` సినిమాతో డార్లింగ్ ప్రభాస్ దేశ వ్యాప్తంగా పాపులర్ అయ్యారు. ఈ సినిమా తెచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. ఎక్కడికి వెళ్లినా ప్రభాస్ గురించిన చర్చేనా అన్నంతగా అతనికి క్రేజ్ పెరిగిపోయింది. దానికి తగ్గట్టే ప్రభాస్ పెళ్లికి సంబంధించిన వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. టాలీవుడ్ లో వున్న యంగ్ క్రేజీ హీరోల్లో అత్యధిక శాతం పెళ్లిళ్లు చేసేసుకుని సెటిలైపోయారు. మూడు పదులు దాటినా ఇంకా ప్రభాస్ ఆమాటైనా ఎత్తకుండా కాలం గడిపేస్తున్నాడు. ఇప్పుడున్న హీరోల్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రభాసే కావడంతో అతని పెళ్లిపై ఇటు టాలీవుడ్లో పాటు అటు బాలీవుడ్ లో పెద్ద చర్చే జరుగుతోంది.
దీనికి తోడు ప్రభాస్ పెళ్లిపై వారానికో వార్త పుట్టుకొస్తూ హల్ చల్ చేస్తోంది. ఆ మధ్య భీమవరంకు చెందిన అమ్మాయితో ప్రభాస్ వివాహం జరగబోతోందని ప్రచారం జరిగింది. ఆ తరువాత అనుష్క.. ప్రభాస్ క్లోజ్ గా మూవ్ కావడంతో త్వరలో ఇద్దరు వివాహం చేసుకోబోతున్నారని ప్రచారం తారా స్థాయికి చేరింది. వీటిని విని అనుష్క.. ప్రభాస్ నవ్వుకున్నారే కానీ స్పందించేందుకు ఇష్టపడలేదు. ఓ ఇంటర్య్వూలో మాత్రం పెళ్లి అనేది తన వ్యక్తిగా వ్యవహారమని దీని గురించి నన్ను ఏమీ అడగొద్దని..పెళ్లి చేసుకుంటే ఆ విషయాన్ని అందరితో పంచుకుంటానని ప్రభాస్ వెల్లడించారు. అయినా ప్రభాస్ పెళ్లిపై ఇటు దక్షిణాది మీడియా కంటే అటు ఉత్తరాది మీడియాలో ఎక్కువ చర్చ సాగుతోంది. తాజాగా మరో వార్త చక్కర్లు కొడుతోంది. ఓ అమెరికన్ బెస్డ్ బిజినెస్మెన్ కూతురిని ప్రభాస్ వివాహం చేసుకోబోతున్నాడనేది ఈ వార్త సారాంశం.
ఇప్పటికే ఇరు కుటుంబాలకు చెందిన పెద్దలు మాట్లాడుకున్నారని త్వరలోనే పెళ్లికి ముహూర్తం ఫిక్స్ చేయబోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ వార్తల్లో నిజమెంత? అన్నది తెలియాలంటే ప్రభాస్ పెదవి విప్పాల్సిందే. లేదూ ప్రభాస్ కి పెళ్లి చేసేందుకు ఎంతో ఆత్రంగా వేచి చూస్తున్న రెబల్ స్టార్ కృష్ణం రాజు కానీ శ్యామలా దేవి గారు కానీ వెల్లడించాల్సి ఉంటుంది. ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం `సాహో` ఈ నెల 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ సినిమా రిలీజ్ తరువాతైనా ప్రభాస్ తన పెళ్లి వార్తని అఫీషియల్‌గా ఆనౌన్స్ చేస్తాడేమో చూడాలి.