Begin typing your search above and press return to search.

ప్రభాస్ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాడా ?

By:  Tupaki Desk   |   27 Aug 2019 11:00 PM IST
ప్రభాస్ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాడా ?
X
'బాహుబలి 2' తర్వాత ప్రభాస్ ఎవరైనా స్టార్ డైరెక్టర్ తో సినిమా చేస్తాడనుకుంటే తన కోసం ఎదురుచూసిన సుజీత్ కే ఛాన్స్ ఇచ్చి 'సాహో'చేసాడు ప్రభాస్. నిజానికి డార్లింగ్ సుజీత్ ని నమ్మి ఇంత పెద్ద సినిమా ఇవ్వడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. అందులో ఒకటి 'రన్ రాజా రన్' చిన్న వయసులో అదీ మొదటి సినిమాకే సూపర్ హిట్ కొట్టాడు సుజీత్. ఆ సినిమా చూసాకే ప్రభాస్ కి సుజీత్ తో ఓ సినిమా చేయాలనిపించిందట.

అందుకే రన్ రాజా రన్ తర్వాత పిలిచి మరీ నాతో సినిమాకు వర్క్ చేస్తావా.. అని సుజీత్ ని అడిగాడట ప్రభాస్. వెంటనే సుజీత్ తప్పకుండా అన్నా అంటూ త్వరలోనే కథతో వస్తానని చెప్పాడట. ఆ కాన్ఫిడెన్సే సుజీత్ ని యంగ్ రెబల్ స్టార్ కి మరింత దగ్గర చేసిందట. ఈ విషయాన్ని స్వయంగా చెప్పాడు ప్రభాస్. ఇక షూటింగ్ సమయంలో చాలా సార్లు సుజీత్ టేకింగ్, కీ సీక్వెన్స్ ను హ్యాండిల్ చేసిన విధానం చూసి ప్రభాస్ కి భలే చేసావ్ సుజీత్ అనిపించిందట.

'సాహో' నాలుగు భాషల్లో కలిపి దాదాపు పది వేల స్క్రీన్స్ లో ఈ నెల ముప్పైన రిలీజ్ కానుంది. తొలి రోజే అన్ని రికార్డులు తిరగరాస్తుందని అందరూ గట్టిగా నమ్ముతున్నారు. యూ.వి.క్రియేషన్స్ కూడా ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మక సినిమాగా సాహోను తెరకెక్కించారు. మరి ప్రభాస్ నమ్మకాన్ని సుజీత్ నిలబెట్టుకుంటాడో లేదో మరో మూడు రోజుల్లో తేలిపోతుంది.