Begin typing your search above and press return to search.
RRR - 'కేజీఎఫ్ 2' రేంజ్ లో 'పుష్ప 2' బిజినెస్ ఆశించవచ్చా..?
By: Tupaki Desk | 15 May 2022 3:30 AM GMTసౌత్ ఇండియాలో ఇప్పటికే స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న అల్లు అర్జున్.. 'పుష్ప' సినిమాతో పాన్ ఇండియన్ స్టార్ గా ఎదిగారు. గతేడాది చివర్లో పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయబడిన 'పుష్ప: ది రైజ్' సినిమా అన్ని భాషల్లోనూ అద్భుతమైన స్పందన తెచ్చుకుంది.
ముఖ్యంగా బాలీవుడ్ లో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన 'పుష్ప-1' మూవీ.. బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుని ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. పుష్పరాజ్ గా బన్నీ పెరఫార్మెన్స్ కు నార్త్ ఆడియన్స్ ఫిదా అయ్యారు.
స్టైలిష్ స్టార్ మేనరిజమ్స్ ఎంతగా పాపులర్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక 'పుష్ప' పాటలు అన్ని వర్గాల ప్రేక్షకులకు రీచ్ అయ్యాయి. ఇవన్నీ ఇప్పుడు రెండో భాగం ''పుష్ప: ది రూల్'' సినిమాపై హైప్ ఏర్పడటానికి.. భారీ అంచనాలు నెలకొనడానికి కారణమయ్యాయి.
ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ - డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న 'పుష్ప' పార్ట్-2 సినిమా.. సెట్స్ మీదకు వెళ్లకముందే ప్రీ రిలీజ్ బిజినెస్ లో రికార్డ్స్ క్రియేట్ చేయబోతోందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఇటీవల విడుదలైన 'ఆర్.ఆర్.ఆర్' మరియు 'కేజీఎఫ్ 2' వంటి రెండు సౌత్ సినిమాలు భారీ వసూళ్లతో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాశాయి. రెండూ ప్రపంచ వ్యాప్తంగా 1100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టాయి. ముఖ్యంగా హిందీ సర్క్యూట్స్ లో సంచలనం సృష్టించాయి.
దీంతో ఇప్పుడు 'పుష్ప 2' సినిమాపై మరియు దాని ప్రీ-రిలీజ్ బిజినెస్ పై హైప్ ఏర్పడింది. RRR - KGF 2 రేంజ్ లోనే ఈ మూవీ బిజినెస్ జరిగే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. ఈ చిత్రం విడుదలకు ముందే ఖచ్చితంగా మేకర్స్ కు భారీ లాభాలను తెచ్చిపెడుతుందని అభిప్రాయ పడుతున్నారు.
'పుష్ప: ది రైజ్' చిత్రానికి ఓటీటీలో అనూహ్యమైన రెస్పాన్స్ రావడంతో.. ఇప్పుడు 'పుష్ప: ది రూల్' డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు దాదాపు 300 కోట్ల రూపాయలు పలుకుతున్నాయట. అలానే సౌత్ థియేట్రికల్ రైట్స్ ఈసారి రూ. 200 - 220 కోట్ల మధ్య ఉంటుందని అంటున్నారు.
'పుష్ప 1' ను మేకర్స్ హిందీలో సరైన విధంగా విడుదల చేసుకోలేకపోయారు. అయినప్పటికీ నార్త్ మార్కెట్ లో 100 కోట్లకు పైగా వచ్చిన వసూళ్లను దృష్టిలో పెట్టుకొని.. 'పుష్ప 2' హిందీ హక్కులను 200 కోట్ల వరకూ అమ్మే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు. ఇక శాటిలైట్ మరియు ఆడియో రైట్స్ ఉందనే ఉన్నాయి.
ఈ విధంగా చూస్తే 'పుష్ప 2' ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా 'ఆర్.ఆర్.ఆర్' - 'కేజీఎఫ్: చాప్టర్ 2' స్థాయిలో ఉండే అవకాశాలు ఉన్నాయని.. ఇది కచ్చితంగా ప్రాఫిటబుల్ ప్రాజెక్ట్ అవుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
అన్నీ సరిగ్గా జరిగితే 'పుష్ప: ది రూల్' ను జూలై లో సెట్స్ పైకి తీసుకెళ్లాలని సుక్కూ అండ్ టీమ్ ప్లాన్ చేస్తోంది. శేషాచలం అడవుల్లో కూలీగా జీవితాన్ని మొదలు పెట్టిన పుష్పరాజ్.. ఎర్ర చందనం స్మగ్లింగ్ సిండికేట్ ను శాసించే స్థాయికి ఎలా ఎదిగాడనేది మొదటి భాగంలో చూపించారు. రెండో భాగంలో అసలైన కథ ఉంటుందని చిత్ర బృందం చెబుతోంది.
ఇందులో పుష్పరాజ్ అల్లు అర్జున్ భార్యగా శ్రీవల్లి పాత్రలో రష్మిక మందన్నా కనిపించనుంది. మొదటి భాగంలో విలన్ గా కనిపించిన ఫహాద్ ఫాజిల్ ఇందులోనూ కొనసాగనున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని - వై రవి శంకర్ పార్ట్-1 ని మించి అధిక బడ్జెట్ తో నిర్మించనున్నారు.