Begin typing your search above and press return to search.
కొంపదీసి సంక్రాంతికి 'రాధేశ్యామ్' రాడా ఏంటి?
By: Tupaki Desk | 26 Dec 2021 3:52 AM GMTసంక్రాంతికి కొత్త అల్లుళ్లు రాకపోయినా ఫరవాలేదు .. 'రాధేశ్యామ్' వస్తే చాలు అనుకునే వాళ్లు చాలామంది ఉన్నారు. వాళ్లంతా కూడా 'రాధేశ్యామ్' కోసం వేయికళ్లతో వెయిట్ చేస్తున్నారు. ఇక పెద్ద నిర్మాతలంతా కలిసి ఈ సినిమా విడుదలకు లైన్ క్లియర్ చేశారు. ఈ సినిమాలో ప్రభాస్ హస్తసాముద్రికంలో ఆరితేరినవాడిలా కనిపించనున్నాడు. ఆయన సినిమా టికెట్ దొరికితే తాము అదృష్టవంతులమనే నమ్మకంతో అభిమానులు ఉన్నారు. ఈ నేపథ్యంలో దర్శకుడు రాధాకృష్ణకుమార్ మాటలు వింటే, ఈ సినిమా రిలీజ్ డేట్ వాయిదా పడుతుందా ఏంటి? అనే డౌట్ రాకపోదు.
తాజా ఇంటర్వ్యూలో రాధాకృష్ణకుమార్ మాట్లాడుతూ .. "ఫస్టు టైమ్ ప్రభాస్ గారు ఈ కథ వినగానే .. 'ఫెంటాస్టిక్ డాళింగ్ ఈ కథ మనం చేస్తున్నాం' అన్నారు. ఈ సినిమాలో ఫైట్లు ఉండకపోవచ్చు .. కానీ ప్రేమకోసం జరిగే యుద్ధాలు ఉంటాయి. తాను ప్రేమించిన అమ్మాయిని చేరుకోవడానికి హీరో చేసే అడ్వెంచర్స్ ఉంటాయి. మైండ్ నుంచి హార్ట్ వరకూ ప్రతి మనిషి జీవితంలో జరిగే ఒక జర్నీ లాంటి కథే ఇది. కథ విదేశీ నేపథ్యంలో సాగుతుంది .. కానీ ఇది ఇండియన్ లవ్ స్టోరీనే. కథ చూస్తున్నంత సేపు మీరు వాళ్లతో ట్రావెల్ అవుతుంటారు.
ఈ సినిమాను ఇండియాతో పాటు జార్జియా .. ఆస్ట్రియా .. ఇటలీ వంటి దేశాలలో చిత్రీకరించాము. ఇక ఈ సినిమాను సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14వ తేదీన విడుదల చేయాలనుకుంటున్నాము" అన్నారు. "ప్రపంచ దేశాలన్నీ కూడా ఒమిక్రాన్ తో భయపడుతున్నాయి. ఇలా ఉన్న ఈ పరిస్థితుల్లో సంక్రాంతికి ఈ సినిమా రావడం ఖాయమేనా?" అనే ప్రశ్నకు రాధాకృష్ణ కుమార్ స్పందిస్తూ, ఒమిక్రాన్ కి సంబంధించిన విషయాలను గురించి నాకు పెద్దగా తెలియదు. సినిమా అయితే మేము ఫినిషింగ్ చేసి రెడీగా పెడతాము. రిలీజ్ అనేది నిర్మాతలకు సంబంధించిన విషయం" అని చెప్పారు.
ప్రపంచ దేశాలన్నీ కూడా 'ఒమిక్రాన్'తో సతమతమవుతున్నాయి. ఏ రోజుకు ఆ రోజు ఈ వైరస్ బారినపడుతున్న వారి సంఖ్య పెరుగుతూ పోతోంది. ఇంతకుముందు వాటికంటే దీని వ్యాప్తి మరింత వేగంగా ఉంటుందని అంటున్నారు. మళ్లీ నైట్ కర్ఫ్యూలు .. లాక్ డౌన్ లు అనే మాటలు వినిపిస్తున్నాయి. నిన్నమొన్నటి వరకూ కాస్త ధైర్యంగా థియేటర్స్ కి వచ్చిన ప్రేక్షకులు, మున్ముందు అలా వస్తారని చెప్పలేని పరిస్థితి. దాంతో 'ఆర్ ఆర్ ఆర్' విడుదల తేదీ ప్రశ్నార్థకంగా మారిందనే టాక్ వినిపిస్తోంది. ఇక ఇప్పుడు 'రాధేశ్యామ్' మేకర్స్ కూడా మరోసారి ఆలోచన చేస్తున్నారా? అనే సందేహం కలుగుతోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.