Begin typing your search above and press return to search.

రాక్షసుడు ఈ ఛాన్స్ అయినా వాడుకుంటాడా ?

By:  Tupaki Desk   |   10 Aug 2019 7:43 AM GMT
రాక్షసుడు ఈ ఛాన్స్ అయినా వాడుకుంటాడా ?
X
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మొదటి జెన్యూన్ హిట్ గా భావిస్తున్న రాక్షసుడు పది రోజుల రన్ పూర్తి చేసుకోబోతోంది . తనతో పాటు అదే రోజు విడుదలైన ఇతర సినిమాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో మొదటి వీకెండ్ ను బాగా వాడుకున్న రాక్షసుడు ఆ తర్వాత నెమ్మదించాడు. వీక్ డేస్ కలెక్షన్స్ లో చెప్పుకోదగ్గ డ్రాప్ కనిపించింది. అనూహ్యంగా నిన్న వచ్చిన మూడు సినిమాలూ డివైడ్ టాక్ తెచ్చుకోవడంతో సాయి శ్రీనివాస్ కు మరోసారి పరిస్థితి అనుకూలంగా మారింది.

మన్మధుడు 2 పరిస్థితి కష్టంగానే ఉంది. డివైడ్ టాక్ పాజిటివ్ గా మారే సూచనలు చాలా తక్కువగా ఉన్నాయని ట్రేడ్ టాక్. అనసూయ కథనం వీక్ గా ఓపెన్ అయ్యింది. రెగ్యులర్ థ్రిల్లర్ అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. కన్నడ భారీ డబ్బింగ్ చిత్రం కురుక్షేత్రంని మనవాళ్ళు కనీసం పట్టించుకున్న దాఖలాలు లేవు. సో ఇంకో వారం రోజులు ఫ్రీ వ్యాక్యుం దొరికేసింది

ఇప్పుడీ అవకాశాన్ని రాక్షసుడు టీం సరైన రీతిలో వాడుకుంటే వసూళ్లు పెరిగే ఛాన్స్ ఉంది. ఇప్పటికే 8 కోట్ల దాకా షేర్ వచ్చిందని ట్రేడ్ చెబుతోంది. ఒకవేళ పబ్లిసిటీ వేగాన్ని పెంచితే ఇది తప్ప వేరే బెటర్ ఆప్షన్ లేదని ప్రేక్షకులు కనక ఫీలయితే ఖచ్చితంగా ఈ రోజు రేపు ప్లస్ అవుతోంది. వీక్ డేస్ లో కూడా ఇంప్రూవ్ మెంట్ చూడొచ్చు. అదే జరిగితే లాభాలు డబుల్ అయినా ఆశ్చర్యం లేదు. సో హీరోతో సహా యూనిట్ రంగంలోకి దిగి కాస్త జనంలోకి వెళ్లడమో లేదా ప్రచారమో చేస్తే కొంచెం మైలేజ్ పెరిగే ఛాన్స్ ఉంది. అది ఎంత శాతమైనా లెక్కలో తేడా కోట్లలో ఉంటుంది. అందుకే శ్రీనివాస్ వెంటనే అలెర్ట్ అయిపొయి ఫీల్డ్ లో దిగితే పరిస్థితి మెరుగు పడవచ్చు