Begin typing your search above and press return to search.

రామ్ చరణ్ యాంకర్ అవుతాడా ?

By:  Tupaki Desk   |   4 July 2019 4:49 AM GMT
రామ్ చరణ్ యాంకర్ అవుతాడా ?
X
ఔననే అంటున్నాయి మెగా కాంపౌండ్ వర్గాలు. అయితే ఇదేదో రియాలిటీ షో కోసమో లేదా టాక్ ప్రోగ్రాం కోసమో కాదు. నాన్న మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న సైరా నరసింహారెడ్డి ప్రమోషన్ కోసం చరణ్ యాంకర్ అవతారం ఎత్తబోతున్నట్టుగా తెలిసింది. అక్టోబర్ 2 ఎంతో దూరంలో లేకపోవడంతో ఒక ప్లాన్ ప్రకారం హైప్ వచ్చేలా చాలా కార్యక్రమాలు ప్లాన్ చేశారట. అందులో భాగమే ఈ చరణ్ యాంకరింగ్. సినిమాలో నటించిన స్టార్ క్యాస్ట్ ఒక్కొక్కరిని విడివిడిగా ఇంటర్వ్యూలు చేసే బాధ్యత చెర్రీ తీసుకుంటాడట.

దీని వల్ల వాటికి వెయిటేజ్ రావడమే కాక హైప్ కూడా పెరుగుతుందని ఆలోచించినట్టు తెలిసింది. అయితే ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ లో బిజీగా ఉండే చరణ్ కు ఇది అంత సులభం కాదు డేట్స్ అడ్జస్ట్ చేసుకుని దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ఈ మేరకు రాజమౌళి ముందుగానే చరణ్ ఓ అండర్ స్టాండింగ్ తో ఉన్నాడట. ఒకవేళ నిజమే అయితే చరణ్ ని యాంకర్ గా సరికొత్త అవతారంలో చూడొచ్చన్న మాట. ఇది ఫలానా ఛానల్ కే చేస్తారని కాదు. షూటింగ్ చేసి ఆ వీడియో ఫుటేజ్ అందరికి ఇస్తారు అంతే.

ఇందులో భాగంగానే అమితాబ్ బచ్చన్ తో ఓ స్పెషల్ ప్రోగ్రాం ప్లానింగ్ జరుగుతున్నట్టు తెలిసింది. విజయ్ సేతుపతి-కిచ్చ సుదీప్-జగపతి బాబు ఇలా ఎవరికి వారు సైరా ప్రమోషన్ లో యాక్టివ్ గా పాల్గొనేందుకు వాళ్ళ డేట్స్ కూడా కొన్ని లాక్ చేసుకున్నట్టుగా చెబుతున్నారు. ఇప్పటిదాకా ఎలాంటి హడావిడి లేదేంటా అని ఎదురు చూస్తున్న మెగా ఫ్యాన్స్ కు ఇది గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఆడియో లాంచ్ కూడా చాలా భారీ ఎత్తున ప్లాన్ చేయబోతున్నారు. ఆగస్ట్ 22 చిరు పుట్టినరోజు లోపే డీటెయిల్స్ తెలిసే అవకాశం ఉంది