Begin typing your search above and press return to search.

రామ్ - ల‌క్ష్మ‌ణ్‌ క‌ల ఈ ఏడాదైనా నెర‌వేరేనా?

By:  Tupaki Desk   |   21 Feb 2022 11:30 PM GMT
రామ్ - ల‌క్ష్మ‌ణ్‌ క‌ల ఈ ఏడాదైనా నెర‌వేరేనా?
X
టాలీవుడ్ లోవున్న టాప్ మోస్ట్ ఫైట్ మాస్ట‌ర్ల‌లో ప్ర‌ధానంగా వినిపించే పేరు `రామ్ - ల‌క్ష్మణ్‌`. ఈ ఇద్ద‌రు ట్విన్ ఫైట‌ర్స్ గ‌త కొన్నేళ్లుగా తెలుగు ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో క్రేజీ ఫైట్ మాస్ట‌ర్స్ గా కొన సాగుతున్నారు. ఎంతో మంది ఫైట్ మాస్ట‌ర్లు వున్నా రామ్ - ల‌క్ష్మ‌ణ్ త‌మ కంటూ ప్ర‌త్యేక‌త‌ని చాటుకుంటూ వ‌స్తున్నారు. వివాదాల‌కు దూరంగా వుంటూ త‌మ‌ని న‌మ్మిన హీరోల ఫ్యాన్స్ అబ్బుర‌ప‌రిచే స్థాయిలో రొమాంచిత‌మైన యాక్ష‌న్ ఘ‌ట్ట‌లాని రూపొందిస్తూ ఫ్యాన్స్ నుంచి కూడా జేజేలు అందుకుంటున్నారు.

వీరు ఫైట్స్ కంపోజ్ చేస్తే ఆ సినిమా బ్లాక్ బ‌స్ట‌రే అనేంత‌గా వీరు పేరు తెచ్చుకున్నారు. కొంత మంది హీరోల‌కు ప‌ర్మినెంట్ ఫైట్ మాస్ట‌ర్స్ గా ప‌ని చేస్తూ ఇన్నేళ్లుగా ఇండ‌స్ట్రీలో కొన‌సాగుతున్న ఈ స‌క్సెస్ ఫుల్ ఫైట్ మాస్ట‌ర్స్ ని తీర‌ని ఓ క‌ల గ‌త కొన్నేళ్లుగా వెంటాడుతోంది. హీరోలు కావాల‌ని ఇండ‌స్ట్రీలోకి ప్ర‌వేశించిన రామ్ - ల‌క్ష్మ‌ణ్ ఫైట్ మాస్ట‌ర్స్ గానే మిగిలిపోయిన విష‌యం తెలిసిందే.

ఖైదీ బ్ర‌ద‌ర్స్ - యాక్ష‌న్ నె.1 వంటి చిత్రాల్లో హీరోలుగా న‌టించారు కానీ ఆ త‌రువాత హీరోలుగా రాణించలేక‌పోయారు. దీంతో త‌మ వార‌సుడు ఆర్య‌ని హీరోగా ఇంట్ర‌డ్యూస్ చేయాల‌ని ప్రయ‌త్రాలు చేస్తున్నారు. 2017లో త‌మ వార‌సుడిని హీరోగా ప‌రిచ‌యం చేయాల‌నే ఆలోచ‌న‌లో వున్నామ‌ని ప్ర‌క‌టించారు రామ్ - ల‌క్ష్మ‌ణ్ . కానీ ఇంత వ‌ర‌కు వార‌సుడికి సంబంధించిన ప్రాజెక్ట్ ని ప‌ట్టాలెక్కించ‌లేక‌పోయారు.

గ‌త కొన్నేళ్లుగా త‌మ క‌ల‌ని నిజం చేసుకోవాల‌ని, అంద‌రి వార‌సుల త‌ర‌హాలోనే త‌మ వార‌సుడిని కూడా సినిమాల్లోకి తీసుకురావాల‌ని ప్ర‌యత్నాలు చేస్తున్నారు. కానీ ఏదీ వ‌ర్క‌వుట్ కావ‌డం లేదు. అయితే గ‌త కొన్ని నెల‌లుగా త‌మ వార‌సుడిని ప‌రిచ‌యం చేసే చిత్రానికి సంబంధించి స్క్రిప్ట్ లు వింటున్నార‌ట‌. క‌థ ఫైన‌ల్ అయితే వార‌సుడి తెరంగేట్రానికి సంబంధించిన కీల‌క ప్ర‌క‌ట‌న‌ని చేయ‌డానికి రెడీ అవుతున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

అయితే రామ్ - ల‌క్ష్మ‌ణ్ వార‌సుడి ఎంట్రీ కోసం చేస్తున్న ప్ర‌య‌త్నాలు ఈ ఏడాదైనా ఫ‌లిస్తాయా? అని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు చెప్పుకుంటున్నాయి.