Begin typing your search above and press return to search.
మెగాస్టార్ ఆఫర్ మాస్ మహారాజ్ కాదంటాడా?!
By: Tupaki Desk | 13 March 2022 12:30 PM GMTచిరంజీవి తనని తాను మలచుకున్న శిల్పం అని ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. కృషితో ఏ స్థాయికి ఎదగవచ్చనేది నిరూపించిన వ్యక్తులలో ఆయన ఒకరు. అందువల్లనే ఆయనను అందరూ మెగాస్టార్ అని పిలుచుకుంటూ ఉంటారు. ఎంత ఎదిగినా ఒదుగుతూ ఉండటం చిరంజీవిలో ప్రధానమైన లక్షణంగా కనిపిస్తూ ఉంటుంది.
టాలెంట్ ఉన్నవారిని అభినందించడానికి ఆయన ఎంతమాత్రం వెనుకాడరు. తనకి గల సుదీర్ఘమైన అనుభవం వలన, ఏ పాత్రను ఎవరు చేస్తే బాగుంటుందనే విషయాన్ని ఆయన చెబుతుంటారు.
అలా 'గాడ్ ఫాదర్' సినిమాలోని ఒక పాత్రకి సత్యదేవ్ అయితే బాగుంటాడని ఆయన దర్శకుడు మోహన్ రాజాకు సూచించడం, ఆయన సత్యదేవ్ ను తీసుకోవడం జరిగిపోయింది. అలాగే బాబీ దర్శకత్వంలోను చిరంజీవి ఒక సినిమా చేస్తున్నారు.
ఇది కూడా ఆల్రెడీ పట్టాలెక్కిపోయిన సినిమానే. ఈ సినిమాకి 'వాల్తేర్ వీర్రాజు' .. 'వాల్తేర్ మొనగాడు' అనే టైటిల్స్ ను పరిశీలిస్తున్నారు. ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రను హీరో రవితేజ చేస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని చిరూ వ్యక్తం చేశారట. దాంతో బాబీ ఆయనను సంప్రదించినట్టుగా వార్తలు వచ్చాయి.
అయితే ఈ సినిమా కోసం రవితేజను సంప్రదించడం నిజమా? కాదా? అనే విషయంలోగానీ, ఒకవేళ అదే నిజమైతే రవితేజ ఏమన్నాడనే విషయంలో గాని ఎలాంటి అప్ డేట్ రాలేదు. కానీ తాజాగా ఈ సినిమా షూటింగులో ఏప్రిల్ నుంచి రవితేజ పాల్గొననున్నాడని తెలుస్తోంది.
అంటే ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయిందన్న మాట. ఆ పాత్రకి తాము కరెక్ట్ అనుకోవడం వల్లనే మెగాస్టార్ సిఫార్స్ చేస్తారని తెలుసును గనుక, ఆయన మాటను కాదనరు. శ్రీకాంత్ కూడా అంతే .. పాత్ర ఏమిటని కూడా అడక్కుండా చిరంజీవి సినిమాలలో చేయడానికి ఉత్సాహాన్ని చూపుతుంటాడు.
అలాగే రవితేజ కూడా ఈ సినిమాలో చేయడానికి అంగీకరించాడని అనుకోవచ్చు. అయితే ఆయన పాత్ర ఏమిటనేది మాత్రం తెలియదు. ప్రస్తుతం రవితేజ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. 'రామరావు ఆన్ డ్యూటీ' సినిమా విడుదలకు ముస్తాబవుతుండగా, 'ధమాకా .. 'రావణాసుర' సెట్స్ పై ఉన్నాయి. ఇక 'టైగర్ నాగేశ్వరరావు' ప్రాజెక్టు కూడా పట్టాలెక్కనుంది. ఇలా వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ, చిరంజీవి సినిమాలో ముఖ్యమైన పాత్రను చేయడానికి ఓకే చెప్పాడంటే ఆయనపై గల గౌరవమే అందుకు కారణమనుకోవాలి.