Begin typing your search above and press return to search.
ఆ రెండు క్లాసిక్స్ ని రావిపూడి టచ్ చేస్తాడా?
By: Tupaki Desk | 28 May 2022 2:30 AM GMTటాలీవుడ్ హిస్టరీలో ఆ రెండు క్లాసిక్స్ ఎన్నటికీ చెరగని సంతకం లాంటివి. ఆయా కాలాల్లో రిలీజై ట్రెండ్ సెట్ చేసిన చిత్రాలవి. కానీ ఇప్పుడు వాటిని టచ్ చేస్తానంటూ అనీల్ రావిపూడి ఇచ్చిన స్టేట్ మెంట్ కలవరపరుస్తోంది. నేటితరం దర్శకుడిపై అంతగా ఆ సినిమాలు ప్రభావం చూపాయిట. ఇంతకీ ఆ రెండు క్లాసిక్స్ ఏవీ? అంటే .. 90లలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ 'జగదేక వీరుడు అతిలోక సుందరి'.. అంతకుముందే వచ్చిన క్లాసిక్ మూవీ 'మాయాబజార్'. ఆ సినిమాల తరహాలో చక్కని సకుటుంబ కథా చిత్రాలను తెరకెక్కించాలనుందని అనీల్ రావిపూడి తన మనసులో మాటను బయటపెట్టారు.
జగదేక వీరుడు అతిలోక సుందరి లాంటి సోషియో ఫాంటసీ మూవీ.. మాయా బజార్ లాంటి ఫ్యామిలీ మూవీని తీయాలనేది తన డ్రీమ్ అని అన్నాడు. అయితే వాటిని టచ్ చేయడం ఏమంత సురక్షితం కాదని ఇప్పటివరకూ ఎవరూ అలాంటి ప్రయత్నాలే చేయలేదు. నిజానికి జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ తీస్తానని మాటిచ్చిన అశ్వనీదత్ కే అది సాధ్యపడలేదు.
చిరు-చరణ్ ఇద్దరినీ కలుపుతూ జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ స్క్రిప్టును రెడీ చేస్తున్నానని కూడా అశ్వనీదత్ అన్నారు. కానీ ఇప్పటికీ తీయలేకపోయారు. ఒకవేళ అనీల్ రావిపూడి ఇప్పుడు సీక్వెల్ కథ రాస్తే గనుక ఆ ఛాన్స్ తనకే దక్కుతుందేమో!.. చూడాలి. అన్నట్టు మెగాస్టార్ చిరంజీవితో సినిమా తీయాలనేది తన కల అని కూడా ఎఫ్ 3 ప్రమోషనల్ ఇంటర్వ్యూలో రావిపూడి అన్నారు. ఒకే దెబ్బకు రెండు పిట్టల్లా అతడు జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ స్క్రిప్టును రాసుకుని దత్ ని ఒప్పిస్తాడేమోచ చూడాలి.
ఇక మాయా బజార్ లాంటి అలనాటి మేటి క్లాసిక్ ని టచ్ చేయాలంటే అపరిమితమైన గట్స్ కావాలి. మళ్లీ అలాంటి గొప్ప సినిమాని రీక్రియేట్ చేయడం ఎవరి తరమూ కాదు.
అయితే అనీల్ రావిపూడి ప్లెజెంట్ గా ఉండే అలాంటి థీమ్ ని ఎంచుకుని నేటితరం నటీనటులతో తనదైన కామిక్ టచ్ తో సినిమా తీయగలడనే భావిద్దాం. ఒకవేళ అలాంటి మాయాజాలాన్ని రిపీట్ చేస్తూ జంధ్యాల తరహా కామెడీ టచ్ తో ఏదైనా క్లాసిక్ ని అతడు తీయాల్సి ఉంటుంది.
ప్రస్తుతం బాలయ్యతో సినిమా చేస్తున్న అనీల్ రావిపూడి తదుపరి నాగార్జునతోనూ సినిమా తీయాలనుందని అన్నారు. అగ్ర హీరోల్లో వెంకీతో వరుసగా రెండు సినిమాలు చేసినందుకు సంతోషం వ్యక్తం చేసారు. చిరు- నాగ్ మాత్రమే పెండింగ్ అని కూడా తెలిపాడు. వెంకటేష్- వరుణ్ తేజ్ హీరోలుగా రావిపూడి తెరకెక్కించిన ఎఫ్ 3 ఈ శుక్రవారం విడుదలైన సంగతి తెలిసిందే.