Begin typing your search above and press return to search.
'లవ్ స్టోరీ' సక్సెస్ ట్రాక్ ని 'రిపబ్లిక్' కొనసాగిస్తుందా..?
By: Tupaki Desk | 1 Oct 2021 6:34 AM GMTకరోనా మహమ్మారి దెబ్బకు కుదేలైన సినీ పరిశ్రమ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఇప్పటి వరకు చిన్న సినిమాలే విడుదల అవుతుండగా ఇప్పుడు క్రేజీ మూవీస్ కూడా థియేటర్లలోకి వస్తున్నాయి. ఇటీవల విడుదలైన 'లవ్ స్టోరీ' సినిమా టాలీవుడ్ బాక్సాఫీస్ కు ఊపిరిపోసింది. తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్ళు రాబట్టిన ఈ చిత్రం ఓవర్ సీస్ మార్కెట్ తిరిగి పుంజుకునేలా చేసింది. అంతేకాదు విడుదల కోసం వేచి చూస్తున్న ఎన్నో చిత్రాలకు ధైర్యాన్ని ఇచ్చింది.
'లవ్ స్టొరీ' చిత్రానికి లభించిన ప్రేక్షకాదరణ చూసి వరుసగా క్రేజీ సినిమాల రిలీజ్ డేట్స్ ని అనౌన్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మెగా మేనల్లుడు సాయి తేజ్ హీరోగా నటించిన ''రిపబ్లిక్'' చిత్రాన్ని ఈరోజు (అక్టోబర్ 1) శుక్రవారం థియేటర్లలోకి తీసుకొచ్చారు. 'వెన్నెల' 'ప్రస్థానం' 'ఆటోనగర్ సూర్య' వంటి చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న దేవకట్టా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.
'రిపబ్లిక్' చిత్రం నుంచి ఇప్పటి వరకు విడుదలైన ఫస్ట్ లుక్ - టీజర్ - ట్రైలర్ - పాటలు సినిమాపై అంచనాలు కలిగించాయి. దీంతో ఈ సినిమా ఓపెనింగ్ బుకింగ్స్ కూడా బాగా జరిగాయి. సినిమా టాక్ బాగుంటే 'లవ్ స్టోరీ' తరువాత ఆ స్థాయిలో సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. ఇదే కనుక జరిగితే టాలీవుడ్ బాక్సాఫీస్ పొజిషన్ ఇంకాస్త మొరుగు పడుతుంది. గాంధీ జయంతి సందర్భంగా వచ్చిన ఈ సినిమా ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.
పవర్ ఫుల్ పొలిటికల్ డ్రామాగా ''రిపబ్లిక్'' చిత్రాన్ని తీర్చిదిద్దారు. ప్రస్తుత రాజకీయ వ్యవస్థ - బ్యూరోక్రాట్స్ మరియు న్యాయవ్యవస్థ మీద రాజకీయ ఒత్తిళ్లు వంటి అంశాలను ఈ చిత్రంలో ప్రస్తావిస్తున్నారు. ఇందులో వ్యవస్థలు సక్రమంగా పని చేసేలా చూసే నిజాయితీ గల ఐఏఎస్ ఆఫీసర్ పంజా అభిరామ్ పాత్రలో సాయి తేజ్ కనిపించనున్నారు. ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటించగా.. రమ్యకృష్ణ - జగపతిబాబు కీలక పాత్రలు పోషించారు.
జీ స్టూడియోస్ సమర్పణలో జె.బి. ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై జె. భగవాన్ - జె. పుల్లారావు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. ఎమ్ సుకుమార్ సినిమాటోగ్రఫీ అందించగా.. కేఎల్ ప్రవీణ్ ఎడిటింగ్ వర్క్ చేశారు.