Begin typing your search above and press return to search.

రౌడీహీరో స్వయంగా హిందీ డబ్బింగ్ చెప్పనున్నాడా..??

By:  Tupaki Desk   |   18 Feb 2021 4:30 PM GMT
రౌడీహీరో స్వయంగా హిందీ డబ్బింగ్ చెప్పనున్నాడా..??
X
టాలీవుడ్ హీరోగా ప్రయాణం మొదలుపెట్టిన రౌడీహీరో విజయ్ దేవరకొండ త్వరలోనే లైగర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ కాబోతున్న సంగతి తెలిసిందే. అయితే హిందీ కాకుండా వేరే ఏ భాష నుండి పాన్ ఇండియన్ సినిమాలలో నటించే స్టార్ హీరోలకు పెద్ద సవాల్ ఒకటుంది. అదేంటంటే.. హిందీలో డైలాగ్స్ చెప్పడం. ఇదే పెద్ద సమస్య అనుకుంటే సరైన సూటబుల్ డబ్బింగ్ ఆర్టిస్ట్ దొరకడం అంతకన్నా పెద్ద సవాల్. తాజాగా విజయ్ దేవరకొండ ఈ పెద్ద సమస్యను తానే స్వయంగా పరిష్కరించాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది. బాలీవుడ్ నివేదికల ప్రకారం.. టాలీవుడ్ అర్జున్ రెడ్డి హిందీలో తన డైలాగ్స్ తానే చెప్పాలని నిర్ణయించుకున్నాడట. అంటే ప్రస్తుతం డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘లైగర్’ మూవీ బాలీవుడ్ వెర్షన్ కోసం విజయ్ కి డబ్బింగ్ ఆర్టిస్ట్ అవసరం లేదు.

ఈ నిర్ణయం నిజమైతే గనక బాలీవుడ్ ఇండస్ట్రీ పట్ల, సినిమా పట్ల అతను ఎంత సీరియస్ గా ఉన్నాడో అర్ధమవుతుంది. హిందీ భాషను కరెక్ట్ గా నేర్చుకోవడానికి.. అలాగే తన సొంత వాయిస్ లో డబ్బింగ్ చెప్పడానికి విజయ్ దేవరకొండ సరైన నిర్ణయం తీసుకున్నాడని సినీవర్గాలు చెబుతున్నాయి. నిజానికి సౌత్ ఇండియా నుండి బాలీవుడ్ ఇండస్ట్రీకి వచ్చేవారికీ హిందీ అనర్గళంగా మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సాధారణంగా హైదరాబాదిలు హిందీ మాట్లాడతారు కానీ అందులో ఉర్దూ కలిసి ఉంటుంది. కానీ బాలీవుడ్ లో పక్కా ప్యూర్ హిందీ మాత్రమే మాట్లాడతారు. కాబట్టి విజయ్ ప్రయత్నం ఏమవుతుందో చూడాలి. లైగర్ విషయంలో అతని హిందీ భాష, యాస సక్సెస్ అయితే గనక ఫ్యూచర్ సినిమాలకు టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ సినిమాలో విజయ్ సరసన అనన్యపాండే హీరోయిన్ గా నటిస్తోంది.