Begin typing your search above and press return to search.
ఆస్కార్ కౌంట్ డౌన్ షురూ.. ఆర్‌ఆర్‌ఆర్ నామినేషన్స్ కి ఆస్కారం
By: Tupaki Desk | 8 Dec 2022 4:23 PM GMTప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నా 95వ అస్కార్ అవార్డుల వేడుక కౌంట్ డౌన్ మొదలు అయ్యింది. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో భాషల్లో తెరకెక్కిన సినిమాలు ఈ వేదికపై సందడి చేయాలని కోరుకుంటూ ఉంటాయి. వేలాది మంది సినిమాలు ఆస్కార్ కోసం పోటీ పడి చివరకు పదుల సంఖ్యలో సినిమాలు నామినేషన్స్ ను దక్కించుకుంటాయి.
95వ అకాడమీ అవార్డు వేడుక మరో 95 రోజుల్లో జరుగుతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా ఆస్కార్ అకాడమీ అధికారికంగా ట్వీట్ చేయడం జరిగింది. ఈ సమయంలో అందరి దృష్టి ఆర్ ఆర్ ఆర్ పై పడింది. పలు అంతర్జాతీయ స్థాయి అవార్డులను దక్కించుకున్న ఆర్ ఆర్ ఆర్ కచ్చితంగా ఆస్కార్ నామినేషన్స్ ను దక్కించుకుంటుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది.
ఆస్కార్ అవార్డు నామినేషన్స్ లో ఆర్ ఆర్ ఆర్ నిలిస్తే అంతకంటే గొప్ప విషయం ఉండదు. ఆస్కార్ దక్కకున్నా కూడా నామినేషన్ లో నిలవాలని ప్రతి ఒక్క ఇండియన్ సినీ ప్రేమికుడు కోరుకుంటున్నాడు. రాజమౌళి అందుకోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు పేర్కొన్నాడు.
మొత్తానికి ఆస్కార్ అవార్డుల యొక్క హడావుడి ఓ రేంజ్ లో ఉండగా మరో వైపు ఇండియన్ ప్రేక్షకులు మాత్రం ఆర్ ఆర్ ఆర్ నామినేషన్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. జనవరి 24 న ఆస్కార్ యొక్క నామినేషన్స్ ను ప్రకటించబోతున్నారు.
ఆ రోజు కోసం చిత్ర యూనిట్ సభ్యులతో పాటు ప్రతి ఒక్కరు వెయిట్ చేస్తున్నారు. అంతర్జాతీయ మీడియా సంస్థల కథనాల అనుసారంగా ఆర్ ఆర్ ఆర్ సినిమా కనీసం రెండు విభాగాల్లో ఆస్కార్ నామినేషన్స్ ను దక్కించుకునే అవకాశం ఉందట. వీఎఫ్‌ఎక్స్ లో నామినేట్ అయితే అవతార్ 2 వంటి భారీ సినిమాతో పోటీ పడాల్సి రావచ్చు అంటున్నారు.
ఆర్ ఆర్ ఆర్ చిత్ర యూనిట్ సభ్యులు ఆస్కార్ నామినేషన్స్ ను దక్కించుకునేందుకు కాస్త ఎక్కువ ఖర్చు పెడుతున్నారని.. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జక్కన్న కోట్ల రూపాయలు ఖర్చు చేయిస్తున్నాడనే ప్రచారం జరుగుతోంది. అంతర్జాతీయ మీడియాలో సినిమా గురించి ప్రచారం జరిగేలా జక్కన్న ప్లాన్ చేశారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.