Begin typing your search above and press return to search.

ఆర్ ఆర్ ఆర్ మాట మీద నిలుస్తుందా ?

By:  Tupaki Desk   |   3 Jun 2019 7:36 AM GMT
ఆర్ ఆర్ ఆర్ మాట మీద నిలుస్తుందా ?
X
అనుకున్న ప్లానింగ్ ప్రకారం కాకుండా బ్రేకుల మధ్య సాగుతున్న ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ ఫైనల్ గా డెడ్ లైన్ మీట్ అవుతుందా లేదా అనే అనుమానాలు ఇద్దరు హీరోల అభిమానుల మధ్య మొదలైపోయాయి. ఇప్పటికే మొత్తం కలిపి సుమారు రెండు నెలల దాకా గ్యాప్ వచ్చేసింది. రామ్ చరణ్ గాయం ఒకసారి తారక్ కు జరిగిన చిన్న ప్రమాదం మరోసారి ఊహించని దేబ్బెశాయి. ఇప్పుడు ఈ లోటుని కవర్ చేసుకుంటూ రాజమౌళి తన ప్లాన్ మొత్తం మార్చుకోవాల్సి వచ్చింది.

ఆ మధ్య ప్రెస్ మీట్ లో అధికారికంగా వచ్చే ఏడాది జూలై 31 అని డేట్ ప్రకటించారు. ఇప్పటిదాకా జక్కన్న అనౌన్స్ చేసిన తేదిని మార్చుకోవడం చాలా అరుదుగా జరిగింది. బాహుబలి కూడా చెప్పిన టైంని మిస్ కాలేదు. కాకపోతే చెప్పడంలోనే ఆలస్యం జరిగింది అంతే. కాని ఆర్ ఆర్ ఆర్ అనౌన్స్ చేశారు. సో ఖచ్చితంగా చేతిలో ఏడాది మాత్రమే టైం ఉంది. ఆలోగా ఇంత కాన్వాస్ మూడు వందల కోట్ల బడ్జెట్ గ్రాండియర్ ని పూర్తి చేయడం అయ్యే పనేనా అనిపిస్తుంది.

కాని రాజమౌళి మాత్రం ఈ విషయంలో కాన్ఫిడెంట్ గా ఉన్నాడట. డిసెంబర్ లో పూర్తి కాకపోతే ఇంకొక్క నెల అదనంగా జనవరిలో ఫినిష్ చేద్దామని విఎఫెక్స్ వర్క్ కు నాలుగు నెలలు సరిపోతాయని ఎలాగూ పూర్తైన పార్ట్ కు రెగ్యులర్ గా పోస్ట్ ప్రొడక్షన్ చేస్తాం కాబట్టి అప్పటికి ఇబ్బందేమీ ఉండదని చెబుతున్నాడట. అయితే ఖచ్చితమైన క్లారిటీ ఇవ్వాలంటే మాత్రం ఇంకో మూడు నాలుగు నెలలు షూటింగ్ అయ్యాక కాని రాదు. అహ్మదాబాద్ షెడ్యూల్ ని త్వరలో ప్రారంభించబోతున్న ఆర్ఆర్ఆర్ టీం ప్రస్తుతం హైదరాబాద్ లోనే షూట్ చేస్తోంది