Begin typing your search above and press return to search.
హేటర్స్ కి సామ్ ఛాన్స్ ఇస్తుందా.. లేక?
By: Tupaki Desk | 22 Oct 2022 6:30 AM GMTతమిళ బ్లాక్ బస్టర్ '96' ఆధారంగా తెలుగులో రీమేక్ అయిన మూవీ 'జాను'. సామ్ భారీ అంచనాలు పెట్టుకున్న ఈ మూవీ తనకు భారీ షాక్ ఇచ్చింది. ఆ తరువాత నాగచైతన్యతో విడిపోతున్నానని ప్రకటించడంతో వార్తల్లో కెక్కిన సమంత ఆ తరువాత 'పుష్ప'లో 'ఊ అంటావా మావ.. ఊహూ అంటావా..' అంటూ స్పెషల్ సాంగ్ తో పాన్ ఇండియా వైడ్ గా వూరల్ కావడమే కాకుండా మరింత పాపులారిటీని సొంతం చేసుకుంది. తమిళ మూవీ 'కాదువాకుల రెండు కాదల్'తో తెలుగు, తమిళ ప్రేక్షకుల్ని పలకరించిన సామ్ ప్రస్తుతం మూడు క్రేజీ ప్రాజెక్ట్ లలో నటిస్తోంది.
గుణశేఖర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మైథలాజికల్ డ్రామా 'శాకుంతలం'తో పాటు సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ 'యశోద'. ఈ మూవీ ద్వారా హరి - హరీష్ దర్శకులుగా పరిచయం అవుతున్నారు. శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్నారు.
మలయాళ నటుడు ఉన్ని ముకుందన్, తమిళ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ భాషల్లో బైలింగ్వల్ గా రూపొందిన ఈ మూవీ గత కొన్ని నెలలుగా రిలీజ్ వాయిదా పడుతూ వస్తోంది.
ఫైనల్ గా ఈ మూవీని నవంబర్ 1న రిలీజ్ చేయాలని మేకర్స్ ఫిక్సయ్యారు. రిలీజ్ డేట్ ని కూడా అఫీషియల్ గా ఇటీవల ప్రకటించారు. అయితే ఈ సినిమాకు ప్రధాన బలం సామ్ మాత్రమే. తను మాత్రమే ఈ మూవీకి ప్రధాన యుఎస్ పీగా మారింది. అయితే ఎంత వరకు తన స్టార్ డమ్ తో ఈ మూవీని సామ్ కాపాడగలదన్నది ఇప్పడు ఆసక్తికరంగా మారింది. కారణంగా ఇదే సమయంలో భారీ సినిమాలు బ్యాక్ టు బ్యాక్ విడుదలవుతుండటమే.
సామ్ సినిమాని ప్రత్యేకంగా చూడాలని ఇష్టపడే ప్రేక్షకులు మాత్రమే 'యశోద'ని చూడటానికి థియేటర్లకు వస్తారు. అయితే అన్ని వర్గాల వారిని ఈ మూవీ ఆకర్షించగలిగితేనే బాక్సాఫీస్ వద్ద విజయాన్ని సాధించడం వీలవుతుంది. అలా కాని పక్షంలో సామ్ 'యశోద'తో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఇన్ సైడ్ టాక్. అదే జరిగే గత కొంత కాలంగా వ్యక్తి గత విషయాల కారణంగా సామ్ ని ట్రోల్ చేస్తున్న వారికి 'యశోద' ఫలితం ఆయుధంగా మారే ప్రమాదం వుందనే వార్తలు వినిపిస్తున్నాయి.
మరి సామ్ ఈ మూవీతో తన సత్తా ఏంటో మరోసారి బాక్సాఫీస్ కు చూపిస్తుందా? లేక చేతులెత్తేసి ట్రోలర్స్‌కి, హేటర్స్ కి ఛాన్స్ ఇస్తుందా? అన్నది తెలియాలంటే నవంబర్ 4 వరకు వేచి చూడాల్సిందే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.