Begin typing your search above and press return to search.

సీనియర్ బ్యూటీ ఇకపై ప్రమోషన్స్ కి 'ఎస్' చెబుతుందా..?

By:  Tupaki Desk   |   14 Jun 2022 11:30 PM GMT
సీనియర్ బ్యూటీ ఇకపై ప్రమోషన్స్ కి ఎస్ చెబుతుందా..?
X
హీరోహీరోయిన్స్ ఒక సినిమాకి సైన్ చేశారంటే.. షూటింగ్ - ప్రమోషన్స్ - మీడియా ఇంట్రాక్షన్స్ - ఇంటర్వ్యూలు - ప్రెస్ మీట్స్ - థియేటర్ విజిట్స్.. ఇలా అన్నిట్లో భాగస్వాములవుతామని అగ్రిమెంట్ చేసుకున్నట్లే. అయితే దీన్నుంచి దక్షిణాది సీనియర్ హీరోయిన్ నయనతార కు మినహాయింపు ఇవ్వాలి.

ఎందుకంటే నయన్ ఏ భాషలో సినిమా చేసినా మీడియా ప్రమోషన్లకు దూరంగా ఉంటానని ముందే క్లియర్ గా మేకర్స్ కు చెప్తుంది. ఇదే విధంగా అడ్వాన్స్ తీసుకొని అగ్రిమెంట్ చేసుకుంటుంది. అయితే ఇప్పుడు ఈ భామ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడానికి అంగీకరించే అవకాశం ఉందని అంటున్నారు.

నయనతార తనకున్న పర్సనల్ కారణాల వల్ల సినిమా ప్రమోషన్స్ కు రాదని చెబుతుంటారు. అవేంటనేది మనకు తెలియదు కానీ.. తమిళ హీరో శింబు మరియు డ్యాన్స్ మాస్టర్ కమ్ డైరెక్టర్ ప్రభుదేవా తో వ్యవహారాలే ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి కారణమని కోలీవుడ్ జనాలు అంటుంటారు.

అప్పట్లో శింబుతో కొన్నాళ్ళు ప్రేమాయణం సాగించిన నయన్.. అతనితో బ్రేకప్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత ప్రభుదేవాతో డేటింగ్ చేసింది. త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని అనుకుంటున్న సమయంలో అతనితో రిలేషన్ షిప్ కి గుడ్ బై చెప్పింది నయనతార. ఇదే క్రమంలో దర్శకుడు విఘ్నేష్ శివన్ తో ప్రేమలో పడింది.

తన ఎఫైర్స్ మరియు పెళ్లికి సంబంధించిన ప్రశ్నలను నివారించడానికే నయన్ ప్రెస్ మీట్‌లకు దూరంగా ఉంటుందని టాక్ ఉంది. అయితే ఇప్పుడు ఆమె విఘ్నేష్‌ ని పెళ్లి చేసుకుని వివాహ బంధంలో అడుగుపెట్టింది. దీంతో అలాంటి ప్రశ్నలకు ఇప్పుడు తెర పడింది.

కాబట్టి నయనతార ఇకపై సినిమా ప్రమోషన్స్‌ లో భాగం కావడానికి అంగీకరించవచ్చని అనుకుంటున్నారు. ఇదే జరిగితే నిర్మాతలకు నిజంగా ఆశ్చర్యం కలిగించే అంశమే అవుతుంది. అయితే ఫిలిం మేకర్స్ కు షాకిచ్చే మరో విషయం ఏంటంటే.. నయన్ ఇక నుంచి సినిమాల్లో రొమాంటిక్ సన్నివేశాల్లో నటించకూడదని నిర్ణయించుకుందట.

ఇక సినిమాల విషయానికొస్తే.. ఇటీవల 'కణ్మణి రాంబో ఖతీజా' సినిమాతో అలరించిన నయనతార.. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి 'గాడ్ ఫాదర్' చిత్రంలో కీలక పాత్ర పోషిస్తోంది. అలానే షారుక్ ఖాన్ 'జవాన్' మూవీతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతోంది. మలయాళంలో 'గోల్డ్'.. తమిళ్ లో 'కనెక్ట్' వంటి చిత్రాల్లో నటిస్తోంది. ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'O2' సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది.