Begin typing your search above and press return to search.
షారుక్ తనయుడికి కోర్టులో మళ్లీ చుక్కెదురు?
By: Tupaki Desk | 12 Oct 2021 7:18 AM GMTకింగ్ ఖాన్ షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ కి కోర్టులో చుక్కెదురైంది. ముంబై క్రూయిజ్ నౌక పార్టీలో డ్రగ్స్ కేసులో ఆర్యన్ కి బెయిల్ మంజూరు చేసేందుకు కోర్టు నిరాకరించింది. ఆర్యన్ తరుపు న్యాయవాది నిన్న మధ్యంతర బెయిల్ పిటీషన్ దరఖాస్తు చేయగా మళ్లీ తిరస్కరణకు గురైంది. బెయిల్ పిటీషన్ పై విచారణ చేపట్టిన న్యాయస్థానం విచారణను అక్టోబర్ 13కి వాయిదా వేసింది. దీంతో మరోసారి ఆర్యన్ ఖాన్ కి ఇబ్బందులు తప్పలేదు. రేపు(బుధవారం) విచారణ అనంతరం బెయిల్ పై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఆర్యన్ తరుపు న్యాయవాది అమిత్ దేశాయ్ ఆర్యన్ ఖాన్ ఎలాంటి డ్రగ్స్ వాడినట్లు ఆధారాలు లేవు కాబట్టి విచారణ ఈరోజు జరపాలని పట్టుబట్టారు.
ఈ నేరానికి కేవలం ఏడాది జైలు శిక్ష. అన్ని రోజులు కస్టడీకి తీసుకోవడం చట్ట విరుద్ధం అంటూ వాదించారు. కానీ కోర్టు అందుకు అంగీకరించలేదు. ఆర్యన్ కి బెయిల్ మంజూరు చేయొద్దని ఎన్సీబీ తరుపున సొలిసిటర్ జనరల్ అనీల్ సింగ్ కోర్టు ను కోరారు. బెయిల్ పై విడుదలైతే దర్యాప్తు పై ప్రభావం పడుతుందని వాదించారు. డ్రగ్స్ ఆరోపణలోపై ఆర్యన్ తో పాటు మరో ఎనిమిది మందిని కస్టడీకి తీసుకున్న సంగతి తెలిసిందే. మరి రేపు విచారణ అనంతరం ఆర్యన్ కి బెయిల్ దొరుకుతుందా? లేదా? అన్న దానిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఆర్యన్ డ్రగ్స్ కేసులో ఇరుక్కోవడంపై ఇప్పటికే పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు స్పందించిన సంగతి తెలిసిందే.
ఆర్యన్ ఖాన్ బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చే ప్రయత్నాల్లో ఉన్నాడు. తండ్రికి తగ్గ తనయుడిగా తీర్చి దిద్దాలని షారుక్ ఎన్నో కలలు కన్నారు. ఆ రకంగా షారుక్ సీరియస్ గా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంతలోనే ఆర్యన్ డ్రగ్స్ వివాదంలో చిక్కుకోవడం ఆ కుటుంబాన్ని ఎంతగానో వేధిస్తోంది. ఆర్యన్ భవిష్యత్ పై నీలినీడలు కమ్ముకున్నాయని ఖాన్ కలత చెందుతున్నారు. అయితే బాలీవుడ్ లో డ్రగ్స్ కల్చర్ ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు యువతలో ఆ సంస్కృతి మరింత ఎక్కువైంది. ఇటీవలే ఇదే కేసులో పలువురు టాలీవుడ్ ప్రముఖుల్ని ఈడీ విచారించిన సంగతి తెలిసిందే. దొరికితే దొంగ దొరక్కపోతే దొర అన్న చందంగా బాలీవుడ్ లో ఈ దందాలు సాగుతున్నాయి. దొరికిపోయాడు కాబట్టి ఆర్యన్ అపరాధి అయ్యాడన్న గుసగుసా మరోవైపు వేడెక్కిస్తోంది.