Begin typing your search above and press return to search.
కబీర్ సింగ్ ‘జెర్సీ’ పై మనసు పడ్డాడా?
By: Tupaki Desk | 25 Jun 2019 10:06 AM GMTబాలీవుడ్లో షాహిద్ కపూర్ అంటే మీడియం రేంజ్ హీరో. వేరే హీరోల కాంబినేషన్లలో చేసిన ‘పద్మావత్’ లాంటి సినిమాల్ని మినహాయిస్తే.. సోలో హీరోగా చేసిన చిత్రాలు భారీ వసూళ్లేమీ రాబట్టలేదు. బ్లాక్ బస్టర్లు కాలేదు. ఐతే అతను హీరోగా నటించిన ‘కబీర్ సింగ్’ సినిమా ఇప్పుడు వసూళ్ల ప్రభంజనం సాగిస్తోంది. షాహిద్ కెరీర్ హైయెస్ట్ గ్రాసర్లను తొలి వారంలోనే దాటేస్తోందీ చిత్రం. కేవలం నాలుగు రోజుల్లో 100 కోట్లు కు పైగా గ్రాస్ కొల్లగొట్టింది. వీక్ డేస్ లో కూడా మంచి వసూళ్లతో సాగిపోతోంది. ఈ సినిమా ఫుల్ రన్లో రూ.200 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయొచ్చని ట్రేడ్ పండిట్లు అంచనా వేస్తున్నారు. షాహిద్ కు ఇంతటి ఘనవిజయాన్నందించింది మన తెలుగు సినిమా. ‘కబీర్ సింగ్’ టాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘అర్జున్ రెడ్డి’కి రీమేక్ అన్న సంగతి తెలిసిందే.
గత ఏడాది ‘టెంపర్’ రీమేక్ ‘సింబా’తో రణ్వీర్ సింగ్ సైతం ఇలాగే భారీ విజయాన్నందుకున్నాడు. మొత్తానికి బాలీవుడ్ స్టార్లకు రీమేక్‌లు బాగానే కలిసొస్తున్నాయి. షాహిద్ సైతం రీమేక్ రుచి మరిగి.. ఇంకో తెలుగు సినిమాపై మనసు పడ్డట్లు సమాచారం. నాని హీరోగా వచ్చిన సమ్మర్ హిట్ ‘జెర్సీ’ని షాహిద్ హీరోగా రీమేక్ చేయబోతున్నట్లు సమాచారం. ఈ చిత్ర రీమేక్ హక్కుల్ని అగ్ర నిర్మాత కరణ్ జోహార్ సొంతం చేసుకున్నాడట. ఆయన షాహిద్‌తో తీయబోయే తొలి సినిమా ఇది. మాతృక దర్శకుడు గౌతమ్ తిన్ననూరినే హిందీలో కూడా డైరెక్ట్ చేస్తాడని అంటున్నారు. ‘జెర్సీ’ కథ భాషా భేదం లేకుండా ఎవ్వరికైనా నచ్చేదే. క్రికెట్ నేపథ్యంలో సినిమా అంటే కనెక్ట్ కానిదెవ్వరికి? మంచి ఎమోషన్ ఉన్న ఈ కథ హిందీ ప్రేక్షకుల్ని కూడా ఆకట్టుకునే అవకాశముంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన రానుంది.