Begin typing your search above and press return to search.

క‌మ‌ల్ కోసం చ‌ర‌ణ్ తో శంక‌ర్ బంతాట ఆడేస్తున్నాడా?

By:  Tupaki Desk   |   21 Dec 2022 8:38 AM GMT
క‌మ‌ల్ కోసం చ‌ర‌ణ్ తో శంక‌ర్ బంతాట ఆడేస్తున్నాడా?
X
మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ 'RRR' మూవీ త‌రువాత ప్ర‌పంచ వ్యాప్టంగా క్రేజీ స్టార్ గా భారీ క్రేజ్ ని సొంతం చేసుకున్న విష‌యం తెలిసిందే. ఆ క్రేజ్ కి త‌గ్గ‌ట్టుగా త‌దుప‌రి ప్రాజెక్ట్ ల‌ని ప్లాన్ చేసుకుంటూ చ‌ర‌ణ్ చ‌క్క‌ని ప్లానింగ్ తో దూసుకుపోతున్నాడు. 'RRR' త‌రువాత రామ్ చ‌ర‌ణ్ ఏస్ డైరెక్ట‌ర్ శంక‌ర్ తో క‌లిసి భారీ పాన్ ఇండియా మూవీని చేస్తున్న విష‌యం తెలిసిందే. RC 15 అనే వ‌ర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ మూవీని స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు.

లాంఛ‌నంగా పూజా కార్య‌క్ర‌మాల అనంత‌రం రాజ‌మండ్రిలో రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లు పెట్టిన శంక‌ర్ అక్క‌డ 90వ ద‌శ‌కం నేప‌థ్యంలో సాగే చ‌ర‌ణ్ పాత్ర‌కు సంబంధించిన కీల‌క ఘ‌ట్టాల‌ని చిత్రీక‌రించారు. డిఫ‌రెంట్ మేకోవ‌ర్ తో వింటేజ్ లుక్ లో చ‌ర‌ణ్ పాత్ర‌ని డిజైన్ చేసిన శంక‌ర్ ఆ పాత్ర నేప‌థ్యంలో రాజ‌మండ్రి ప‌రిస‌రాల్లో ప‌లు ఆస‌క్తిక‌ర స‌న్నివేశాల‌ని పూర్తి చేశారు. ఆ త‌రువాత చిత్ర భృందం అమృత్ స‌ర్ కి వెళ్ల‌డం.. అక్క‌డ ప‌లు కీల‌క స‌న్నివేశాల‌ని చిత్రీక‌రించ‌డం తెలిసిందే.

ఆ త‌రువాత శంక‌ర్ క‌మ‌ల్ హాస‌న్ హీరోగా మ‌ద్య‌లో నిలిచిపోయిన 'ఇండియ‌న్ 2'ని తిరుగి ప్రారంభించారు. ఈ మూవీ షూటింగ్ కోసం చ‌ర‌ణ్ సినిమాని హోల్డ్ లో పెట్టిన శంక‌ర్ రీ సెంట్ గా చ‌ర‌ణ్ మూవీకి సంబంధించిన ఓ పాట‌ని న్యూజిలాండ్ లో పూర్తి చేసిన విష‌యం తెలిసిందే. ఆ త‌రువాత మ‌ళ్లీ బ్రేకిచ్చిన శంక‌ర్ 'ఇండియ‌న్ 2' షూటింగ్ కి వెళ్లిపోవ‌డం తెలిసిందే.

తాజాగా మ‌ళ్లీ 'ఇండియ‌న్ 2'కు బ్రేకిచ్చిన శంక‌ర్ RC 15 తాజా షెడ్యూల్ కోసం ప్లాన్ చేస్తున్నాడు. ఈ మూవీ తాజా షెడ్యూల్ ని రాజ‌మండ్రి గోదావ‌రి ఒడ్డున ఓపెన్ సెట్ లో మొద‌లు పెట్ట‌బోతున్నాడు. ఇందు కోసం ఇప్ప‌టికే భారీ పార్టీ మీటింగ్ త‌ర‌హాలో రాజ‌మండ్రి గోదావ‌రి ఒడ్డున ఇసుక తిన్నెల‌పై చుట్టూ భారీ క‌టౌట్ ల‌తో ఓ స‌భాప్రాంగణాన్ని త‌ల‌పించేలా వాతావ‌ర‌ణాన్ని క్రియేట్ చేశారు. అక్క‌డ చ‌ర‌ణ్ పాల్గొన‌గా ప‌లు కీల‌క ఘ‌ట్టాల‌ని పూర్తి చేస్తార‌ట‌. ఈ షూటింగ్ అక్క‌డ మూడు రోజులు జ‌ర‌గ‌నుంద‌ట.

ఈ షెడ్యూల్ ని ఇలాగే కంటిన్యూ చేసి సినిమాని శంక‌ర్ పూర్తి చేస్తాడా? లేక మ‌ళ్లీ బ్రేకిస్తాడా? అని ఫ్యాన్స్ అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. 'ఇండియ‌న్ 2' కోసం శంక‌ర్ RC 15 ని బంతాట ఆడుకుంటున్నాడ‌ని, ఓ షెడ్యూల్ ఇక్క‌డ‌.. క‌ట్ చేస్తే మ‌రో షెడ్యూల్ 'ఇండియ‌న్ 2' అంటూ ఏ ప్రాజెక్ట్ నీ త్వ‌ర‌గా పూర్తి చేయ‌డం లేద‌ని ఫ్యాన్స్ వాపోతున్నార‌ట‌.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.