Begin typing your search above and press return to search.
శౌర్య సరికొత్త ప్రమోషనల్ స్ట్రాటజీ వర్కౌట్ అయ్యేనా..?
By: Tupaki Desk | 10 Sep 2022 9:36 AM GMTస్టార్ హీరో నటించిన సినిమా ఐనా.. అగ్ర దర్శకుడు తీసిన చిత్రమైనా.. భారీ బడ్జెట్ తో రూపొందించిన మూవీ అయినా సరే.. సరైన రీతిలో పబ్లిసిటీ చేయాల్సిన అవసరముంది. సినిమాను జనాల్లోకి తీసుకెళ్లడానికి ఏదో ఒకటి కొత్తగా.. మిగతా వారి కంటే వైవిధ్యంగా ఆలోచించాలి.
ఒకప్పుడు ఆడియో ఫంక్షన్ చేసి.. టీవీ ప్రకటనలు - పేపర్ యాడ్స్ ఇస్తే సరిపోయేది. కానీ ఇప్పుడు అలా కాదు. ఇంటర్నెట్ వినియోగం.. సోషల్ మీడియా వాడకం విస్తృతంగా పెరిగిన వచ్చిన తర్వాత ఆఫ్ లైన్ తో పాటుగా ఆన్ లైన్ లోనూ ప్రమోషన్స్ చేయాల్సి వస్తోంది.
రెగ్యులర్ గా అప్డేట్స్ ఇస్తూ తాము ఎలాంటి కంటెంట్ తో వస్తున్నామో చెప్పడానికి.. జనాల దృష్టిని ఆకర్షించడానికి డిఫరెంట్ ప్రమోషనల్ స్ట్రాటజీలతో వస్తున్నారు మన ఫిలిం మేకర్స్. ఇప్పుడు ఓటీటీలకు అలవాటు పడిపోయిన వారిని థియేటర్లకు రప్పించడానికి.. పబ్లిసిటీ మీద ఇంకాస్త ఎక్కువ శ్రద్ధ తీసుకోవాల్సి వస్తోంది.
ఇందులో భాగంగా ప్రెస్ మీట్స్ పెట్టడం - ఫన్నీ ఇంటర్వ్యూలు చేసి వదలడం.. టీజర్ లేదా ట్రైలర్ లాంచ్ కోసం ఈవెంట్స్ చేయడం.. గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ నిర్వహించడం.. ప్రధాన నగరాల్లో చక్కర్లు కొట్టడం.. కాలేజీ టూర్లు వంటివి మనం కామన్ గా చూస్తుంటాం. అయితే ఇప్పుడు యువ హీరో నాగశౌర్య తన సినిమాని జనాలకు చేరువ చేయడానికి పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నారట.
నాగశౌర్య హీరోగా అనీష్ ఆర్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం "కృష్ణ వ్రింద విహారి". శౌర్య హోమ్ ప్రొడక్షన్ ఐరా క్రియేషన్స్ బ్యానర్ లో ఆయన తల్లిదండ్రులు నిర్మిస్తున్నారు. ఇదొక న్యూ ఏజ్ యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్. ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
'కృష్ణ వ్రింద విహారి' చిత్రాన్ని సెప్టెంబర్ 23న థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సరికొత్త ప్రమోషన్స్ ముందుకు వెళ్లాలని భావించిన శౌర్య.. రెగ్యులర్ పబ్లిసిటీ ఫార్మాట్ కు భిన్నంగా పాదయాత్ర స్ట్రాటజీని ఫాలో అవుతున్నాడట.
పాదయాత్ర అనేది రాజకీయ నాయకులు జనాలకు చేరువ అవ్వడానికి ఉపయోగించే ప్రచారాస్త్రం. ఇప్పుడు శౌర్య కూడా తన టూర్ లో అదే ఫాలో అవుతాడట. రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు నగరాలకు టూర్లు - కాలేజీ విజిట్లు ప్లాన్ చేసిన యువ హీరో.. అక్కడికి వెళ్లిన తర్వాత పాదయాత్ర ద్వారా జనాలతో ఇంట్రాక్ట్ అవుతూ మూవీ ప్రమోషన్స్ చేస్తాడట.
సినిమా పబ్లిసిటీ కోసం శౌర్య ఐడియా బాగానే ఉంది.. కానీ ఇది ఏ మేరకు వర్కవుట్ అవుతుందో.. జనాలను ఎంతవరకు ఆకర్షిస్తుందో.. సినిమాకు ఏ విధంగా ప్లస్ అవుతుందో వేచి చూడాలి.
కాగా, 'కృష్ణ వ్రింద విహారి' సినిమాలో నాగశౌర్య సరసన షిర్లీ సెటియా హీరోయిన్ గా నటించింది. రాధిక శరత్ కుమార్ కీలక పాత్ర పోషించగా.. వెన్నెల కిషోర్ - రాహుల్ రామకృష్ణ - సత్య - బ్రహ్మాజీ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు.
శంకర్ ప్రసాద్ మల్పూరి సమర్పణలో ఉషా మల్పూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం సమకూర్చారు. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందించగా.. తమ్మిరాజు ఎడిటింగ్ వర్క్ చేశారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.