Begin typing your search above and press return to search.
కన్నుగీటుకి అంత సీన్ ఉందా ?
By: Tupaki Desk | 3 Feb 2019 10:46 AM GMTఇప్పుడు ఏ రంగమైనా సరే వైరల్ పబ్లిసిటీ శాశ్వతం కాదు. కేవలం కొంత కాలం మాత్రమే దాని ప్రభావం ఉంటుంది. అది మహా అయితే ఆరు నెలల నుంచి ఏడాది కావొచ్చు. అంతకుమించి దేనికీ సీన్ ఉండదు. కొన్నేళ్ల క్రితం ధనుష్ వై థిస్ కొలెవరి పాట ఫీవర్ తో దేశం మాత్రమే కాదు ప్రపంచవ్యాప్త సంగీత లోకం ఊగిపోయింది. కట్ చేస్తే ఇప్పుడది ఒక మాములు పాట. గత ఏడాది ఓరు ఆధార్ లవ్ అనే మలయాళీ ట్రైలర్ లో కన్నుగీటి గన్ను పేల్చిన సుందరిగా ప్రియా ప్రకాష్ వారియర్ రేపిన సెన్సేషన్ చూసాంగా . ఏకంగా తన ఇంటికి రక్షణ ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది.
కరణ్ జోహార్ మొదలుకుని దిల్ రాజు దాకా తనను తెరకు పరిచయం చేసేందుకు తహతహలాడారని ఓ రేంజ్ లో కథనాలు వండి వడ్డించారు. అదంతా గతం. పాల పొంగులా ఇప్పుడది ఆరిపోయింది. ప్రకాష్ వారియర్ సినిమా అవునా అంటున్నారే తప్ప ఎవరూ ఎగ్జైట్ అవ్వడం లేదు. ఇప్పుడా సినిమా లవర్స్ డే పేరుతో తెలుగులో 14న విడుదల కాబోతోంది. అల్లు అర్జున్ ని గెస్ట్ గా తీసుకొచ్చి ప్రీ రిలీజ్ గ్రాండ్ గా చేసారు. సినిమా కన్నా బన్నీ బాహుబలి కట్టప్పను చంపాడు అని పొరపాటుగా చెప్పడం ఎక్కువ వైరల్ అయ్యింది. అంతకు మించి లవర్స్ డేకు ఎలాంటి అదనపు బజ్ తోడవ్వలేదు.
అయితే ప్రియా వారియర్ కెరీర్ దీంతో ఎక్కడికో వెళ్ళిపోతుందని టాలీవుడ్ అవకాశాలు ముంచెత్తుతాయని ఊహించుకున్న వాళ్ళు లేకపోలేదు. పరిస్థితి చూస్తుంటే ఈ లవర్స్ డే మహద్బుతంగా ఉంటే తప్ప ఏ రకంగానూ హెల్ప్ అయ్యే ఛాన్స్ లేదు. ప్రియ తప్ప ఇంకెవరు మనకు తెలియని మొహాలు కావడం మరో మైనస్. నేటివిటీ సమస్య వల్ల మలయాళం సినిమాలు తెలుగులో డబ్ కావడం ఎప్పుడో ఆగిపోయాయి. స్టార్లుగా చెప్పుకునే అంత పెద్ద మమ్ముట్టి,మోహన్ లాల్ ల సినిమా డబ్బింగులు వచ్చే ఏళ్ళు దాటింది. అలాంటిది లవర్స్ డే ఏం చేస్తుందనేది వేచి చూడాలి